యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..
ప్రభుత్వానికి పలు సూచనలతో స్కై లేఖ
సికింద్రాబాద్, ఆగస్ట్ 28 (ప్రజామంటలు):
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడే పాట్లు, అగచాట్లు దయనీయంగా ఉన్నాయి. మధ్యరాత్రి నుంచే వరుసలు, వరుసలుగా నిలబడటం, చెప్పులను క్యూ లైన్ లో ఉంచడం రైతుల కష్టాలకు నిదర్శనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులను ఆదుకోవడంలో ముందు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సమయాన్వయం చేసుకుంటే యూరియా సమస్యను చాల సులువుగా పరిష్కరించవచ్చని సికింద్రాబాద్ కు చెందిన స్కై ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ వై.సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్, ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. అలాగే రాష్ర్ట మంత్రులు పొంగులేటిశ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు లకు లేఖలు పంపించారు. యూరియా సమస్యను తీర్చడానికి చేసిన సూచనలు ఆయన మాటల్లోనే....
ప్రభుత్వం రైతు భరోసా సహాయం కింద డబ్బులు రైతుల అకౌంట్లో ఎలా జమ చేస్తున్నారో, అదే విధంగా కొంత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ రైతుకు చేరేలా చర్యలు చేపట్టి, రైతు భరోసా అందుకుంటున్న ఆ రైతు సెల్ ఫోన్ నుంచి తనకు ఎంత యూరియా అవసరమో అంత యూరియాకు హెల్ప్ లైన్ కి సందేశం పంపేలా ఉండాలి. యూరియా కోసం రైతు వెతకడం కాకుండా, రైతు ఇంటివద్దకే ప్రభుత్వం యూరియా అందించేలా చర్యలు తీసుకుంటే అన్నం పెట్టె అన్నదాతకు మరింత తోడ్పాటు అందించినట్టు అవుతుంది, ఎప్పటికప్పుడు యూరియా కోసం మెసేజ్ వచ్చిన రోజే, అతనికి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నుంచి రైతుకు ఎప్పుడు యూరియా అందిస్తుందో సందేశం పంపించగలితే, రైతు భరోసాతో తన పొలం పనులు చేసుకుంటాడు. మరో పరిష్కారం ఎవ్వరి గ్రామంలో ఆ గ్రామ రైతులు, ఆ గ్రామ అధికారికి ఎంత యూరియా అవసరమో తెలియజేస్తే, ఆ గ్రామ అధికారి నేరుగా ప్రభుత్వానికి నివేదిక పంపించి, యూరియా ఎప్పుడు వస్తుంది అనే సమాచారాన్ని తెలుసుకొని ఇటు రైతులకు వచ్చిన సమాచాన్ని చేరవేస్తూ, యూరియా వచ్చిన వెంటనే రైతులకు అందించే అవకాశం ఉంటుంది.
రైతుల సాధకబాదకల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయి అధికారిని పూర్తిగా నియమించి అధికారాలను అందిస్తే రైతులకు మరో చేయూతను అందించినట్టు అవుతుంది. యూరియా విషయంలో ఎవరైనా కృత్తిమ కొరతను సృష్టిస్తే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ట్విట్టర్ ద్వారా, మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించడం జరిగింది. ప్రభుత్వం పరిశీలన చేసి తగుచర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైనగణేశ నవరాత్రి ఉత్సవము వేడుకలు
