జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుంది రైతులు అపోహలకు గురికావద్దు
జగిత్యాల ఆగస్ట్ 26 ( ప్రజా మంటలు)
యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుంది రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మరియు జిల్లా కో-ఆపరేటివ్ అధికారి , డి ఏ ఓ, డి సి ఓ, మండల వ్యవసాయ అదికారులు మరియు PACS సీఈఓ ల తో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. అనంతరం మీడియాతో
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూరియా ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందన్నారు .జిల్లాలో మొత్తం 20 మండలాలు, 51 PACS (మొత్తం 97 అవుట్లెట్లు) ద్వారా రైతులకు ఎరువులు అందజేస్తున్నాం.
మొత్తం సరఫరా వివరాలు:
2024 ఆగస్టు వరకు: 27,479 మెట్రిక్ టన్నులు (6,10,644 సంచులు)
2025 26 2: 25,502 (5,66,716)
లబ్దిపొందిన రైతులు: 2,03,854
సొసైటీలకు సరఫరా :
మొత్తం సరఫరాలో 63 % ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఇప్పటి వరకు పంపిణి చేసాం.
2024 ఆగస్టు వరకు: 13,942 మెట్రిక్ టన్నులు (3,09,822 సందులు), లబ్దిపొందిన రైతులు - 98,806
2025 ఆగస్టు 26 వరకు: 16,049 మెట్రిక్ టన్నులు (3,56,645 సంచులు), లబ్దిపొందిన రైతులు 1,27,694
జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతోందన్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్యాక్స్ ( PACS )మరియు ప్రైవేట్ అవుట్ లెట్ల ద్వారా సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. భాస్కర్, డి సి ఓ మనోజ్ కుమార్, మరియు సంబంధిత మండల వ్యవసాయ అదికారులు మరియు ప్యాక్స్ సీఈఓ లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
