ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి
చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు
విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం
హైదరాబాద్ ఆగస్ట్ 25 (ప్రజా మంటలు);
తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసిన, తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే అవుతుందని అన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినీ విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడిండ్ రూమ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉస్మానియాను ఒక అద్బుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ నిపుణులు, విద్యా శాఖ నిపుణలతో ఒక కమిటీని నియమించి సమగ్రమైన అంచనాలు రూపొందించాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా గారిని ఆదేశించారు. స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలను మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
“విద్యా రంగానికి ఈ ఏడాది 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఉస్మానియా కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి ఇబ్బందేమీ లేదు. రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం 20 వేల కోట్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం. 
ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దు. ఈ వర్సిటీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలవాలి. ప్రపంచ ప్రమాణాలతో అద్బుతమైన వర్సిటీగా రూపొందించడానికి ఏం కావాలో అడగండి. రాష్ట్ర సాధనలో ముందు భాగంలో నిలబడిన ఈ యూనివర్సిటీని గాలికొదిలేయడం సరికాదు. ఈ యూనివర్సిటీకి మరోసారి వస్తా. ఈసారి ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా సభ పెట్టుకుందాం. యూనివర్సిటీని అభివృద్ధి చేయడంలో నాకు చిత్తశుద్ధి ఉంది. అంచనాలు రూపొందించండి.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతో మంది విద్యార్థులు, నాయకులు ఇక్కడి నుంచి వచ్చిన వారే. తెలంగాణ సమాజానికి సమస్యలున్నా, సంక్షోభం వచ్చినా మొదట చర్చ జరిగేది ఉస్మానియా నుంచే ఆ సమస్య మాది అని భావించేదే ఈ నిలయం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియాను కాలగర్భంలో కలిపేయాలన్న కుట్ర జరుగుతున్న సందర్భంలో ఈ వర్సిటీకి పూర్వ వైభవం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం ఆలోచనలు చేశాం. రాష్ట్రంలోని యూనివర్సిటీలు అన్నింటినీ చదువులకే కాకుండా సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాం.
ఉస్మానియా వర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో దళితుడు వైస్ చాన్సెలర్ కాలేదు. ప్రస్తుతం వీసీ మొలుగరం గారి నైపుణ్యాన్ని గుర్తించి వీసీగా నియమించాం. అలాగే మిగతా యూనివర్సిటీలు, విద్యా కమిషన్‌కు అలాగే నియమించాం.
వర్సిటీలు ఉద్యోగులు, అధికారులను ఉత్పత్తి చేయడానికి మాత్రమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన మేధాసంపత్తిని అందిస్తుందని ఆశిస్తున్నాం. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు వయసున్న యువత 65 శాతం ఉంది. యువత శాసనసభకు పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయ పరిమితిని 21 సంవత్సరాలకు ఎందుకు తగ్గించకూడదో ఆలోచన చేయాలి.
యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు జరగాలి. సాంకేతిక పరమైన చర్చలు జరగాలి. వర్సిటీలు, విద్యాలయాల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించడం లాంటి వ్యసనాల బారిన పడటానికి దారితీస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పంచడానికి భూములు లేవు. ఖజానాలో ఖాళీగా ఉంది. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు నా సూచన ఒక్కటే నాణ్యమైన విద్య ఒక్కటే మన తలరాతలను మార్చగలుగుతుంది. చదువుకునే వయసులో ఇతర వ్యాపకాలకు లోనైతే దారితప్పుతాం.
విద్యార్థినీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చాను. సమస్యలు పరిష్కరించడానికి వచ్చినప్పుడు వ్యతిరేకించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకున్న వారవుతారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉపాధ్యాయ నియామకాల కోసం కేవలం 55 రోజుల్లో 11 వేల మంది టీచర్లను నియమించాం. వచ్చే ఆరు నెలల్లో ఇంకో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల కాలం నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో వేల కోట్ల పెట్టుబడులను తేవడమే కాకుండా 1.5 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించాం.
అపోహలకు లోను కావద్దు. అనుమానాలు ఉంటే నివృతి చేస్తాం. అబద్దాలను నమ్మకండి. కొందరు జీర్ణించుకోలేక ప్రతిదానికి అడ్డుపడుతున్నారు. అలాంటి వారు తెలంగాణ సమాజానికి ముసుగేసుకున్న చెదల్లాంటి వారు. ఉస్మానియా వర్సిటీని ఉంచకూడదని, ఎవరూ చదువుకోవద్దని కోరుకునే వారు. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మీరంతా చదువుకోవాలి. చదువు ఒక్కటే ఈ సమాజాన్ని మార్చగలదు..” అని ముఖ్యమంత్రి సవివరంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సెలర్లు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... “ఒక్క క్లిక్… మీ కష్టార్జీతం మాయం!”
సికింద్రాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
వాట్సాప్ గ్రూపులలో ఫోన్ పే పొంగల్ గిఫ్ట్ “5000 రూపాయలు నిజంగా వచ్చాయి” అనే ఆశ చూపించే తప్పుడు సందేశాలతో పాటు లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల పొదుపును దోచుకుంటున్నారని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ వై. సంజీవ కుమార్ అన్నారు. డబ్బులు... మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు):
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు.
ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.... మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 3 నగరాలు, 38 పురపాలికలు
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర పురపాలక శాఖ 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు సంబంధించి మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలులో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.... ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక
ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):
ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి... ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు: పోచారం, కాలే యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు వెలువరించారు.
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్... ‘జన నాయగన్’ కు ఎదురుదెబ్బ: నిర్మాత పిటిషన్‌ను స్వీకరించని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 15 (ప్రజా మంటలు):
విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా సర్టిఫికేషన్ అంశానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది.
ఈ సినిమా నిర్మాతలు తమపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడిందని, “తాము పూర్తిగా నష్టపోయాం... సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ... జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వేదికను అలంకరింపజేసి ఉత్సవ మూర్తులను వేదికపై ఉంచి కళ్యాణాన్ని... 