విశ్వశాంతి ,ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 25 (ప్రజా మంటలు)
విశ్వశాంతి కోసం ,ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంకులో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, బ్రహ్మకుమారీల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ని ర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా శాంతి, ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న బ్రహ్మకుమారీల సేవలను కొనియాడారు. రక్తదానం చేద్దాం విలువైన ప్రాణాలను కాపాడుదాం అన్న నినాదంతో బ్రహ్మకుమారీలు విశ్వబంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు ఉండరాదని రక్తమును ఉత్పత్తి చేయలేమని రక్తము ఇతరులకు దానం చేయడం వలన సమాజ సేవ అవుతుందే తప్ప ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి అవరోధాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు బ్రహ్మకుమారీల సమాజం ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహిస్తున్నారని ఇది సమాజానికి ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. మౌంట్ అబూ కేంద్రం గా విశ్వవ్యాప్తంగా బ్రహ్మకుమారీలు సామాజిక సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్డెంట్ డా.మల్లికార్జున్ రెడ్డి . బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది ,రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ బాధ్యులు టీవీ సూర్యం ,రక్త దాతలు ,బ్రహ్మకుమారీ సమాజం సోదర ,సోదరీలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !
.jpg)
రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది!
.jpg)
పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్
-(1).jpg)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా
