పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
గణేష్ వేడుకలు–2025 ఏర్పాట్లపై శాంతి కమిటీతో సమన్వయ సమావేశం
సికింద్రాబాద్, ఆగస్ట్ 25 (ప్రజామంటలు) :
రాబోయే గణేష్ ఉత్సవం–2025 ను ప్రజలు సంబరంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, వేడుకలు సాఫీగా నిర్వహణకు పోలీస్ అధికారులతో సహకరించాలని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ కోరారు. సోమవారం ఉత్తర మండల డీసీపీ కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అదనపు డీసీపీ , గోపాలపురం, మహాంకాళి,బేగంపేట,తిరుమల్ గిరి డివిజన్ల ఏసీపీలు, ఉత్తర మండలంలోని ఎస్హెచ్ఓలు, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్లతో పాటు 70 మందికి పైగా శాంతికమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సవాల విస్రృతి, ప్రాధాన్యత దృష్ట్యా, గత అనుభవాలను సమీక్షిస్తూ, ప్రజా భద్రత, సాఫీగా ఉత్సవాలు, శాంతియుత నిమజ్జన ప్రదర్శనల కోసం సమగ్ర ఏర్పాట్లను ఖరారు చేశారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పర్యావరణ హిత మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సహించాలన్నారు. అన్ని గణేశ్ మండపాలు ఆన్ లైన్ లో రిజిస్ర్టేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. మండపాల్లో స్వచ్చంద కార్మికుల వివరాలు, గుర్తింపు పత్రాలు, బ్యాక్ గ్రౌండ్ దృవీకరణ, అగ్రిమాపక, విద్యుత్ భద్రత చర్యలు, మండపాల వద్ద పేలుడు పదార్ధాలు, జ్వలించే పదార్దాల వాడకంపై నిషేదం, రోడ్ల అక్రమణలు, ప్రజాప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు చేయకూడదనే అంశాలపై పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, తనిఖీలు చేయాలన్నారు.
విగ్రహాల పరిమితులు, ట్రాఫిక్ మళ్ళింపులు,చిన్న, చిన్న చెరువుల్లో సురక్షిత నిమజ్జనంపై అవగాహన కల్పించాలన్నారు. 24 గంటల పాటు స్వచ్చంద కార్మికుల డ్యూటీ, సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్సింటిగైషర్ల ఏర్పాటు, పరిశుభ్రత పాటించడంపై దృష్టి పెట్టాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కామన్వెల్త్ గేమ్స్మీ లో మీరాబాయి చానుకు స్వర్ణం !
.jpg)
రాజస్థాన్లో డైనోసార్ శిలాజం బయటపడింది!
.jpg)
పోలీసులు స్టేషన్ నుండే సాక్ష్యం ఇవ్వచ్చు ననే ఢిల్లీ LG నోటిఫికేషన్‌ను వ్యతిరేకించిన బార్ కౌన్సిల్
-(1).jpg)
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

పెరిగిన బాధ్యతతో క్రమశిక్షణగా విధులు నిర్వహించాలి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

గణేశ్ ఏర్పాట్లు, జాగ్రత్తలపై చిలకలగూడ ఏసీపీ సమీక్షా

తనకు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్కు ఎమ్మెల్యే సన్మానం

పండుగను సంబురంగా, శాంతియుతంగా జరుపుకోవాలి. - నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

గణేష్ నవరాత్రుల నిర్వాహకులతో సిఐ, రామసింహారెడ్డి సమావేశంల

ప్రపంచంలోనే అద్భుతమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా ను తీర్చిదిద్దాలి - డీమ్ రేవంత్ రెడ్డి

ఎన్నారై అడ్వైజరీ బోర్డు పునర్నిర్మాణం చేయాలి - చాంద్ పాషా
