శ్రీ సాంబ శివుని సన్నిధిలో అమావాస్య పూజలు భక్తుల భజన - అల్పాహారం
బుగ్గారం ఆగస్టు 23 (ప్రజా మంటలు)::
జగిత్యాల జిల్లా బుగ్గారం లోని సాంబుని గుట్ట ప్రాంతంలో గల సంతాన యుక్త శ్రీ సాంబ శివ నాగేశ్వరాలయం లో అమావాస్యను పురస్కరించుకొని ఆలయ కమిటి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి శివదీక్ష భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో శివ లింగానికి అభిషేకం చేశారు. భజనలు చేసి భక్తి కీర్తనలు ఆలపించారు.
మంగళ హారతులు ఇచ్చి స్వామి వారిని ప్రత్యేకంగా కొలిచారు. అనంతరం పంచామృతాల తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహార విందును సామూహికంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు అగస్త్య మహరాజ్ అఘోర, ఆలయ అర్చకులు సాత్పడి రంగయ్య, ఆలయ కమిటి, శివదీక్షా భక్త బృందం సభ్యులు కటుకూరి ఆంజనేయులు, బొద్ధుల లక్ష్మణ్, పెద్దన వేణి రాగన్న, తాడెపు లింగన్న, చుక్క గంగారెడ్డి, కూతురు పోచమల్లు, కొత్తపల్లి గంగాధర్, పరమాల చిలుకయ్య, కేతి గంగన్న తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
