పాట్ మార్కెట్ ఘటనకు మార్వాడి సమాజానికి సంబంధం లేదు
బాధితుడు సాయి వెల్లడి
సికింద్రాబాద్, ఆగస్ట్ 21 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 30 న జరిగిన ఘటన లో పాట్ మార్కెట్ మార్వాడి వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు సాయి తెలిపారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ రోజు తనకు, ఎస్కే జ్యువెల్లర్స్ వ్యాపారుల మద్యనే వివాదం జరిగిందన్నారు. రోడ్డుపై హారన్ కొట్టడంతో జరిగిన వివాదం ఎస్సీ,ఎస్టీ కేసు వరకు వెళ్ళగా, కొందరు తమ మద్య జరిగిన గొడవను పాట్ మార్కెట్ వ్యాపారుల అందరితో కలిపి ముడి పెట్టారన్నారు. అసలు గొడవకు పాట్ మార్కెట్ లోని వ్యాపారస్థులకు ఎలాంటి సంబందం లేదన్నారు.
ఆ రోజు గొడవ జరిగినప్పుడు మార్వాడి సమాజం తనతోనేఉందని, వారు హాస్పిటల్ లో తనతోనే ఉన్నారని బాధితుడు సాయి తెలిపారు. కొందరి కారణంగా సోషల్ మీడియాతో పాటు పత్రిక,టీవీ మీడియాల ద్వారా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. దీనికి ముగింపు చెప్పడానికే ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు సాయి వివరించారు. పాట్ మార్కెట్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
