వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

On
వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి

- సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ ఆగస్ట్ 12:

గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అను నిత్యం అప్రమత్తంగా ఉండాలి చెప్పారు. లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని అలర్ట్ చేయించాలని చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా, కంట్రోల్ రూమ్తో కమ్యూనికేషన్ ఉండాలని అన్నారు. వచ్చే 72 గంటలు అలర్ట్ ఉండాలి.. ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని సూచించారు. అధికారులతో పాటు ఇన్చార్జ్ మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. రాబోయే మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ సహా వరద ప్రభావిత జిల్లాల్లో నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వీలైతే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు.పాఠశాలలు, కాలేజీలు నడపాలా, సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.  

రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.IMG-20250812-WA0020

రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 రాబోయే మూడు రోజులు కీలకంగా మారినందున అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా, పశు సంపదకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలి.

 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని తట్టుకునే విధంగా పట్టణాలు నిర్మితమై ఉన్నాయి. అలాంటిది క్లౌడ్ బరస్ట్ సమయాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలి. గతంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడటంతో నష్టం జరిగింది.

 విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి. నిధులకు కొరత లేదు. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలి. సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి.

హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలి. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలి.

 హైదరాబాద్, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం నిర్వహించుకునేలా ఆయా సంస్థలతో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గారు సమన్వయం చేయాలి. 

 వీలైనంత వరకు ప్రజలను రోడ్లపైకి రాకుండా అప్రమత్తం చేయాలి. హైడ్రా తరఫున ఎఫ్ఎం రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ప్రజలను ఆందోళనకు గురిచేసే సమాచారం ఇచ్చే సంస్థలకు వెనువెంటనే వాస్తవాలను వెల్లడించాలి. 

నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలున్నాయి. జోనల్ కమిషనర్లను అప్రమత్తమై అలాంటి చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

 భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి. NDRF సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. 

 హైడ్రా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. సహాయక చర్యల కోసం ఎక్కడ అవసరమైతే వారిని అక్కడికి తరలించాలి.

 విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం పునరుద్దరణ పనులు చేపట్టాలి. మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్, అవసరమైతే జనరేటర్స్‌ను సమకూర్చాలి. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

 ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా, అలాగే పట్టణాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైన మెడిసిన్స్, సౌకర్యాలను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. 

 ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందో ఆ ప్రాంతాల్లో సమన్వయం కోసం కలెక్టర్లు అదనంగా అధికారులను నియమించుకోవాలి. 

గ్రేటర్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ముసీ పరివాహక ప్రాంతంతో పాటు ప్రమాద స్థాయికి నీరు చేరుకునే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియంత్రించాలి. 

 ప్రాజెక్టులు, చెరువులు, కుంట‌ల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటి పారుదల శాఖ అధికారులు పూర్తి అవ‌గాహ‌న‌తో ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నీటి విడుద‌ల‌పై పూర్తి స‌మాచారం ఇవ్వాలి. చెరువులు, కుంట‌లు క‌ట్ట‌లు తెగే ప్ర‌మాదం ఉన్నందున ముంద‌స్తుగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

 మా శాఖకు సంబంధం లేదని ఏ విభాగం చెప్పడానికి వీలులేదు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను క్రియేట్ చేసుకుని సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కొందరు సీనియర్ ఆఫీసర్లను డిప్యూట్ చేసుకోవచ్చని తెలిపారు.

 వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక 

ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు)  అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక  ధర్మపురి ఆగస్టు 13 (ప్రజా మంటలు): ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మధు మహాదేవ్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషన్  ఎన్నికయ్యారు. స్థానిక కర్నె అక్కపెళ్లి కళ్యాణమండపంలో  రాష్ట్ర నాయకులు జె.సురేందర్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సంగనభట్ల రామకృష్ణయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలచారి,ఆధ్వర్యంలో ఐ జే యు జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటీ...
Read More...
National  State News 

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు పాట్నా ఆగస్ట్ 12:మంగళవారం (ఆగస్టు 12, 2025)న విడుదల చేసిన ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, కొత్తగా ఓటర్ల నమోదు కోసం దాదాపు 64,000 దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. బీహార్ SIR: కొత్తగా దరఖాస్తులు దాఖలు చేస్తున్న ఓటర్లు డ్రాఫ్ట్ రోల్స్‌లో లేరా లేదా మొదటిసారి ఓటర్లా అనేది EC డేటా అస్పష్టంగా ఉంది...
Read More...
Local News 

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి సికింద్రాబాద్, ఆగస్టు 12 (ప్రజామంటలు): రాష్ర్ట బీజేపీ యువమోర్చా నాయకులు మర్రి పురూరవరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్బంగా రాష్ర్ట బీజేపీ అద్యక్షులు రాంచందర్ రావు మర్రి పురూరవరెడ్డికి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తార్నాక లోని ఆయన నివాసంలో మర్రి పురూరవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.రాంచంద్రరావు...
Read More...
National  Local News  State News 

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్,  ఆగస్టు 12 (ప్రజా మంటలు)::ట్రాఫిక్ పోలీసులు మరొక చెట్టుకు పునర్జన్మ ఇచ్చారు. మహాంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్నీ జంక్షన్ సమీపంలో  ఉన్న ఓ పెల్టో ఫోరం చెట్టు కు సంబందించి విస్తరించిన కొమ్మల కారణంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్...
Read More...

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025  విద్యా సంవత్సరానికి గాను నిర్వహించబడే డిప్లమా  ఇన్ మ్యాజిక్ కోర్సులో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని వర్సిటి రిజిస్ర్టార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు , ఔత్సహిక కళాకారులు తమ దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని సంబంధిత శాఖలో సమర్పించి నేరుగా...
Read More...
National  Local News  State News 

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్ *డాక్టర్ నమ్రతపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు*మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సికింద్రాబాద్, ఆగస్టు12 (ప్రజామంటలు) : సంచలనం రేపిన సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కు సంబందించిన కేసును ప్రభుత్వం నార్త్ జోన్ పోలీసుల నుంచి ప్రత్యేక విచారణ బృందం (సిట్) కు బదిలీ చేసింది. ఇకనుంచి...
Read More...
Local News  State News 

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్ శస్త్రచికిత్స లేకుండా  ప్రోస్టేట్ క్యాన్సర్‌, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స సికింద్రాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) :  తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా...
Read More...
State News 

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్ హైదరాబాద్, ఆగస్ట్ 12 (ప్రజామంటలు) : మిసెస్ క్రియేటీవ్–2019 మిసెస్ లావణ్య అదారి తన కలల డిజైనర్ బోటిక్ షాపును మంగళవారం సిటీలోని అత్తాపూర్ లో విజయవంతంగా లాంచ్ చేశారు. మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో పేరుతో ప్రాంభించిన బోటిక్ లో బ్రైడల్ కు సంబందించిన ఫ్యాషన్ దుస్తులు, చిక్ వెస్ర్టన్ ఔట్ ఫిట్స్,...
Read More...
Local News 

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ పనుల పురోగతిని పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం   ఇబ్రహీంపట్నం ఆగస్టు 12 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట్ 33/11కేవీ సబ్స్టేషన్ లో సామర్థ్యానికి మించి లోడు నమోదు అవుతున్న దృష్ట్యా రూ.85 లక్షలతో అదనపు 5 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మంజూరి కావడం, మూడు రోజుల క్రితం సబ్స్టేషన్ కు  పంపించారు....
Read More...
Local News  State News 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు  హైదరాబాద్ ఆగస్ట్ 12: కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సుజాత అనే మహిళా ఉద్యోగిని రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి రూ.15 వేల రూపాయలు సుజాత డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుని తీసుకుంటుండగా పట్టుకొన్నారు.
Read More...
State News 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి  అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 12: గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో...
Read More...
National  State News 

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 12:   'నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు, లక్నో మెట్రో విస్తరణ', ₹18541 కోట్ల విలువైన ప్రణాళికలను కేబినెట్ ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, ₹18,541 కోట్ల విలువైన ప్రణాళికలను ఆమోదించారు. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్...
Read More...