డిపివో "చీకోటి మదన్ మోహన్ పై" చర్యలు తీసుకోండి - జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన బుగ్గారం వాసులు
అవినీతికి పాల్పడి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదని ఆరోపణ...?
లోకాయుక్త తీర్పు, జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలను భే ఖాతర్ చేశారని ఆవేదన
చట్టాలను ఉల్లంఘిస్తున్న జిల్లా పంచాయతీ అధికారులు
విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న డిపివో మదన్ మోహన్...??
బుగ్గారం ఆగస్టు 11 (ప్రజా మంటలు):
చట్టాలను ఉల్లంఘిస్తూ, లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాల ఉత్తర్వులను కూడా భే ఖాతర్ చేస్తూ, అత్యంత విలువైన తన విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి "చీకోటి మదన్ మోహన్ పై" చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా వాణి లో జిల్లా కలెక్టర్ కు బుగ్గారం వాసులు పిర్యాదు చేశారు.
గత ఎనిమిది నెలల నుండి బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు, విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి కోర్ కమిటి వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న లు ఆరోపించారు. లోకాయుక్తతో పాటు జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాలు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆర్డర్లను కూడా తుంగలో త్రొక్కారని వారు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన అనేక ఉత్తర్వులను, సమాచార హక్కు చట్టం దరఖాస్తులను, అప్పీల్లను ఇతర పిర్యాదులను సైతం బుట్ట దాఖలు చేసి పట్టించుకోవడం లేదన్నారు. బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ దోషులతో కుమ్మక్కై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ దోషుల ద్వారా అవినీతికి పాల్పడి తన విధులను, అత్యంత విలువైన బాధ్యతలను విస్మరిస్తున్నారని పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
అవినీతి - అక్రమాలతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిపివో చీకోటి మదన్ మోహన్ పై 25 సందర్భంలను తెలియ పరుస్తూ చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)