మెట్ పల్లి పట్టణంలో మూడో సబ్ స్టేషన్ కొరకు స్థల పరిశీలన
మెట్టుపల్లి ఆగస్టు 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
మెట్ పల్లి పట్టణంలో నిర్మించబోయే మూడవ కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్ కొరకు రేగుంట 13 వ వార్డులో సేకరించిన స్థలాన్ని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం పరిశీలించారు. ప్రస్తుతం మెటుపల్లి పట్టణ, రేగుంట , వెంకట్రావుపేట అవసరాలకు రెండు సబ్ స్టేషన్ లు ఒకటి వట్టివాగు పక్కన, రెండోది వెంకట్రావుపేట కుంట లో పని చేస్తున్నాయి.
సుమారు 24 వేల వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణానికి మూడవ సబ్స్టేషన్ కొరకు ప్రతిపాదనలు పంపగా ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి రూ.1.30 కోట్లతో రేగుంట కాకతీయ కాలువ పక్కన 13 వ వార్డులో పరిపాలన, సాంకేతిక అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ సుదర్శనం మాట్లాడుతూ, టెండర్ల దశ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)