దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
.
జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు)
పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు.
మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతి శనివారం 101 ప్రదక్షణలు చేస్తుంటారు. వివిధ పండుగల సందర్భంలో వందలాదిమంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. అయితే కొంతమంది దేవాలయ ప్రవేశ ద్వారానికి ఆనుకొని అక్రమంగా షెడ్లు వేసుకొని కూరగాయల వ్యాపారాన్ని నిర్వహిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, షెడ్లను పక్కకు జరిపించాలని గత కొంతకాలంగా మున్సిపల్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శనివారం ఆలయానికి వచ్చిన భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు, వివిధ హిందూ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున రోడ్డుమీదకు వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దేవాలయం ముందు వ్యాపారుల షెడ్లను తొలగించి దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆలయ ఈవో మున్సిపల్ కమిషనర్ ను లిఖిత పూర్వకంగా కోరారు.
భక్తుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో దేవాలయం ముందు ఉన్న షెడ్లను తొలగిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో భక్తులు ఆందోళన విరమించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
