వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

On
వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి

- సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ ఆగస్ట్ 12:

గ్రేటర్ హైదరాబాద్లో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రానున్న మూడ్రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అను నిత్యం అప్రమత్తంగా ఉండాలి చెప్పారు. లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని అలర్ట్ చేయించాలని చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా, కంట్రోల్ రూమ్తో కమ్యూనికేషన్ ఉండాలని అన్నారు. వచ్చే 72 గంటలు అలర్ట్ ఉండాలి.. ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని సూచించారు. అధికారులతో పాటు ఇన్చార్జ్ మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. రాబోయే మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ సహా వరద ప్రభావిత జిల్లాల్లో నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వీలైతే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు.పాఠశాలలు, కాలేజీలు నడపాలా, సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.  

రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.IMG-20250812-WA0020

రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. రానున్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 రాబోయే మూడు రోజులు కీలకంగా మారినందున అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా, పశు సంపదకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలి.

 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని తట్టుకునే విధంగా పట్టణాలు నిర్మితమై ఉన్నాయి. అలాంటిది క్లౌడ్ బరస్ట్ సమయాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలి. గతంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడటంతో నష్టం జరిగింది.

 విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలి. నిధులకు కొరత లేదు. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలి. సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి.

హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలి. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు సివిల్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలి.

 హైదరాబాద్, రంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం నిర్వహించుకునేలా ఆయా సంస్థలతో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గారు సమన్వయం చేయాలి. 

 వీలైనంత వరకు ప్రజలను రోడ్లపైకి రాకుండా అప్రమత్తం చేయాలి. హైడ్రా తరఫున ఎఫ్ఎం రేడియోల ద్వారా, టీవీల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ప్రజలను ఆందోళనకు గురిచేసే సమాచారం ఇచ్చే సంస్థలకు వెనువెంటనే వాస్తవాలను వెల్లడించాలి. 

నగరంలో శిథిలావస్థలో ఉన్న భవనాలున్నాయి. జోనల్ కమిషనర్లను అప్రమత్తమై అలాంటి చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

 భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి. NDRF సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. 

 హైడ్రా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 2 వేల మందికి శిక్షణ ఇచ్చాం. సహాయక చర్యల కోసం ఎక్కడ అవసరమైతే వారిని అక్కడికి తరలించాలి.

 విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణం పునరుద్దరణ పనులు చేపట్టాలి. మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్, అవసరమైతే జనరేటర్స్‌ను సమకూర్చాలి. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్స్‌ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

 ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా, అలాగే పట్టణాల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర సమయాల్లో అవసరమైన మెడిసిన్స్, సౌకర్యాలను అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. 

 ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందో ఆ ప్రాంతాల్లో సమన్వయం కోసం కలెక్టర్లు అదనంగా అధికారులను నియమించుకోవాలి. 

గ్రేటర్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ముసీ పరివాహక ప్రాంతంతో పాటు ప్రమాద స్థాయికి నీరు చేరుకునే ప్రాంతాలకు ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియంత్రించాలి. 

 ప్రాజెక్టులు, చెరువులు, కుంట‌ల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటి పారుదల శాఖ అధికారులు పూర్తి అవ‌గాహ‌న‌తో ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నీటి విడుద‌ల‌పై పూర్తి స‌మాచారం ఇవ్వాలి. చెరువులు, కుంట‌లు క‌ట్ట‌లు తెగే ప్ర‌మాదం ఉన్నందున ముంద‌స్తుగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

 మా శాఖకు సంబంధం లేదని ఏ విభాగం చెప్పడానికి వీలులేదు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను క్రియేట్ చేసుకుని సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కొందరు సీనియర్ ఆఫీసర్లను డిప్యూట్ చేసుకోవచ్చని తెలిపారు.

 వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

రాష్ట్రంలోని  భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి 

రాష్ట్రంలోని  భూములన్నిటికి భూధర్ నంబర్ల - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ ఆగస్ట్ 13: రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ స‌ద‌స్సుల్లో వార‌స‌త్వ‌, ఇత‌ర మ్యుటేష‌న్ల‌కు సంబంధించి స్వీక‌రించిన ద‌రఖాస్తుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి రెవెన్యూ శాఖ...
Read More...
Local News 

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు

పోలీసులు వృత్తి నిబద్దతతో పనిచేయాలి - బదిలీ అయిన చిలకలగూడ సిబ్బందికి వీడ్కోలు సికింద్రాబాద్, ఆగస్ట్ 13 (ప్రజామంటలు) : పోలీసుల ప్రతిష్టను మరింత పెంపొందించేలా క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నిబద్దతతో  విధులు నిర్వహించాలని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌ పేర్కొన్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్  నుంచి సిటీలోని పలు ఠాణాలకు ట్రాన్స్ఫర్  అయిన ఒక ఏఎస్‌ఐ, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం వీడ్కోలు కార్యక్రమం...
Read More...
National  State News 

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు 

కోదండరాం, ఆలీఖాన్ ల ఎమ్మెల్సీ ఎంపికను రద్దు చేసిన సుప్రీంకోర్టు  న్యూ ఢిల్లీ ఆగస్ట్ 13: సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ ఎం. కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్ నియామకాలను రద్దు చేస్తూ ఆగస్టు 13, 2025న సంచలన తీర్పు వెలువరించింది. ఈ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ మరియు కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై...
Read More...
Local News 

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ

చిరు వ్యాపారులకు గొడుగులు, సబ్సిడీ ఆటోలు పంపిణీ చేసిన డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్గ్ 13 (ప్రజామంటలు) : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ బుధవారం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ లో ప్రభుత్వం నుంచి మంజూరైన సబ్సిడీ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలను ఆర్థికంగా నిలబెట్టడం కోసమే ప్రభుత్వం...
Read More...
Local News 

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం  నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

గొల్లపెల్లి మండలంలో క్రీడా మైదానం  నిర్మాణ పనులకు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య):   గొల్లపల్లి ఆగస్టు 13  (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండల యువకులు గతకొంతకాలంగా క్రీడా మైదానానికి స్థలం లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం  మంత్రి  దృష్టికి తీసుకెళ్లగా వెంటనే  స్పందిస్తూ, రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్‌లతో చర్చించి, క్రీడా మైదాన నిర్మాణం కోసం ఏడు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రొసీడింగ్...
Read More...
Local News 

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల  అశోక్ 

యువత డ్రగ్స్ పట్ల అప్రమత్తత కలిగి ఉండాలి ప్రొఫెసర్ అరిగెల  అశోక్  జగిత్యాల ఆగస్ట్ 13 ( ప్రజా మంటలు)స్థానిక ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాలలో నేడు డ్రగ్స్ మరియు మత్తుపదార్థాలపై విద్యార్థులు మాస్ ప్రతిజ్ఞ చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య  అశోక్ హాజరయ్యారు.   ప్రిన్సిపాల్ మాట్లాడుతూ దేశంలో మత్తు పదార్థాల విషయంలో, కేంద్ర...
Read More...
Local News 

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఆగస్ట్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ,జగిత్యాల జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై సర్దార్ సర్వాయి పాపన్న...
Read More...
Local News  State News 

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ

ప్రసవానికి గర్బిణీని మోసుకెళ్ళిన భర్త -మానవ హక్కుల కమిషన్ విచారణ అడ్వకేట్ రామారావు ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ సికింద్రాబాద్, ఆగస్ట్ 13 (ప్రజామంటలు) : అమానవీయ పరిస్థితులలో సంగారెడ్డి జిల్లా నాగుల గిద్ద మండలంలోని మునియా నాయక్ తండాలో   కౌషి బాయి అనే గిరిజన గర్భిణీ మహిళ ప్రసవించిన సంఘటన తెలిసిందే.  ఎలాంటి రవాణ సౌకర్యాలు, సరైన రోడ్డు లాంటి మౌళిక వసతులు ఏవీ...
Read More...
Local News 

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు.

భద్రత చర్యలో భాగంగా ప్రముఖ ఆలయాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు. భద్రత చర్యలో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలలో సమగ్ర తనిఖీలు. (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్  ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్...
Read More...
Local News 

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా  తిప్పర్తి రాజకుమార్

శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులుగా  తిప్పర్తి రాజకుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పట్టణంలో శ్రీ గాయత్రి మాత విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఎన్నికల నిర్వహించారు అధ్యక్షులుగా తిప్పర్తి రాజకుమార్ ఉపాధ్యక్షులుగా, మారుపాక లింగబాబా ఎదులాపురం నరసింహచారి దుంపెట్ సందీప్ ప్రధాన కార్యదర్శిగా సజ్జనకు రవి సహాయ కార్యదర్శిగా ఇందూరు నిరంజన్ చారి కోశాధికారిగా కోటి నీలకంఠం గౌరవాధ్యక్షులుగా...
Read More...
Local News  Crime 

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

రాజేశ్వరరావుపేట్ గ్రామ శివారులోని వరద కెనాల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఇబ్రహీంపట్నం ఆగస్టు 13( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వరరావు పెట్ గ్రామ శివారులో గల వరద కెనాల్ నందు గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చినది. మృతదేహం ఎత్తు అందాద 5.2 ఉండి, నీలం రంగు డబ్బాలుగల షర్టు, నీలం రంగు కాటన్ జీన్స్ మరియు ప్యాంటు లోపల...
Read More...
Local News 

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి - ఎంఇఓ బండారి మధు ఇబ్రహీంపట్నం  ఆగస్టు 13 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులతోఎంఇఓ బండారి మధు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని  ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు పాఠశాల స్థాయి...
Read More...