జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు రూ: 9 లక్షల విలువ గల 35.96 కిలోల గంజాయి దహనం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఆగస్ట్ 12 ( ప్రజా మంటలు)
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 36 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 35.96 -కిలోలను, ఎన్ డిపిఎస్ చట్టం ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని అన్నారు .
దహనం చేసిన గంజాయి విలువ సుమారు 9 లక్షలు రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ వివరించారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు కమిటీ సభ్యులగా ఎస్ బి డిఎస్పీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉండడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్ డి పి ఎస్ యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన 36 కేసులలో నిల్వ ఉన్న గంజాయిని దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు అక్రమార్జనలో భాగంగా, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు.
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసిన, అమ్మిన, సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు రఘు చందర్, రాములు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సి.ఐ లు రవి,కరుణాకర్, ఆర్ ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి ప్రెస్ క్లబ్ (ఐజేయు) అధ్యక్షునిగా మధు మహాదేవ్ ఎన్నిక

బీహార్ లో కొత్తగా 64 వేల మంది మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచంద్రరావును కలిసిన మర్రి

మరో చెట్టుకు పునర్జన్మను ఇచ్చిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు

తెలుగు వర్సిటి ఇంద్రజాలం కోర్సులో నేరుగా ప్రవేశం
.jpeg)
సృష్టి కేసు సిట్ కు బదలాయింపు - 25 మంది అరెస్ట్, రిమాండ్

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

అత్తాపూర్ లో మ్యాచ్ ఆండ్ ప్యాచ్ బోటిక్వీన్ స్టూడియో ఓపెనింగ్

అమ్మక్కపేట్ సబ్స్టేషన్ కు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు - ఉద్యోగి అరెస్టు

వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలి - సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందం
.jpeg)