గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 21 జూలై (ప్రజా మంటలు) :
జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు, కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు.
అమీర్ పేట్ లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ వేడుకలలో శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, మాజీ మంత్రులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య,బిసి కమీషన్ మాజీ చైర్మన్ బి ఎస్ రాములు,,కళాశాల భూదాత కాసుగంటి నారాయణ రావు మనుమడు, న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్ కుమార్,తెలుగు అకాడమీ పూర్వ రీసెర్చర్ డా.తుల రాజేందర్, శాతవాహన యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి,తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ చాన్సలర్ అనుమాండ్ల భూమయ్య,మాజీ ఎమ్మెల్సీ కమలాకర్ రావు,లోకాయుక్త లీగల్ డైరెక్టర్ నవమోహన రావు, మాజీ డీసీపీ వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, తూము భీమ్ సేన్,తదితర ప్రముఖులతో పాటుగా ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ డా ఆశోక్, పూర్వ విద్యార్థులు సిరిసిల్లశ్రీనివాస్, ఎస్పీసుబ్రహ్మణ్యం, సిహెచ్ వి.ప్రభాకర్ రావు, కుంటాల గంగాధర్ తిలక్,సారంగాపూర్ బాపు రెడ్డి,విఠల్,పూర్వ ఆచార్యులు కూతురి రాంకిషన్, మాజీ ఐఏఎస్ జీ రాజిరెడ్డి,గండ్ర లక్ష్మణ్ రావు,రాయికల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు తదితరులు పాల్గొని, కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు ను ఘన సన్మానించి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, జగిత్యాల డిగ్రీ కళాశాల ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ సంస్థను యూనివర్సిటీగా లేదా స్కిల్ ఇండియా సెంటర్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాలానుగుణంగా విద్యా రంగంలో విద్యార్థులకు మరింత ప్రగతిశీలమైన అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
త్వరలోనే జగిత్యాల కళాశాల 60 సంవత్సరాల వేడుకల నిర్వహణ, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు, విశ్వవిద్యాలయంగా మార్చడానికి తగు ప్రయత్నాలు చేయడానికి, ప్రభుత్వానికి తగు సూచనలు చేయడానికి, ఒప్పించడానికి వీలుగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్బంగా రాజేశం గౌడ్, ఎం ఎల్ సి ఎల్ రమణ మాట్లాడుతూ.....
- కళాశాల పూర్వ విద్యార్తిగా కళాశాల అభివృద్ధికి తమవంతుగా సహకరిస్తామని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా, స్కిల్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి విన్నవిస్తామన్నారు.
- ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో సాగిపోయిన వేళ, కొండలరావు గారి జీవితం, వారి సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని పాల్గొన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో తెలిపారు.
- అలాగే కళాశాల అభివృద్ధికి, 60 వసంతాలను వైభవంగా నిర్వహించడానికి అవసరమైనా అన్ని ఏర్పాట్లను అందరి సహకారంతో చేయడానికి తనవంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందించి, జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు కళాశాల పేరు నిలబెడతామన్నారు.
- అంతేకాకుండా కళాశాలకు 32 ఎకరాలకు పైగా భూమిని దానం చేసిన శ్రీ కాసుగంటి నారాయణ రావు విగ్రహాన్ని నెలకొల్పాలన్నారు.
- వారి కుటుంబాన్ని గౌరవించడం కళాశాల విద్యార్థుల బాధ్యత అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్వర్గీయ దాశరథి కృష్ణమాచారి 101 వ జయంతి సందర్భంగా తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన కవితాబివంధనాలు.

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.

హనుమకొండ జిల్లా హడుప్సా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సబర్మతి సురేష్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్
