ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క
కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరి
సికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):
రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి క్షీణిస్తున్న ప్రస్తుత రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం అపోహాలను పక్కనపెట్టి తన శరీరంలోని మూలకణాలను దానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదేళ్ల బాలుడికి తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాధి అంటే ఎముక మజ్జ లోపంగా నిర్ధారణ అయ్యింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పలు వైద్య పరీక్షలు చేసిన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు పేషంట్ మూలకణాలను మార్చాలని సూచించారు. దాంతో ఇంటర్ చదువుతున్న అక్క తన తమ్ముడికి ధైర్యం చెప్పి, తన శరీరంలోని మూలకణాలను దానం చేసి అతని ప్రాణాన్ని రక్షించింది.
రాఖీ పండుగ రోజున శనివారం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో తమ్ముడికి రాఖీ కట్టి, నీ కోసం నేను ఉన్నాను తమ్ముడు అని దైర్యం చెప్పింది. ఈ సందర్భంగా డా. నరేందర్ కుమార్ తోట మాట్లాడుతూ, ఇది అక్కా తమ్ముళ్ల అనుబంధానికి నిజమైన నిదర్శనం అని, అపోహలను పక్కన పెట్టి ధైర్యంగా తమ్ముడి ప్రాణం కాపాడిందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
