తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన
జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)
ఆచార్య శ్రీ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ లోని 4కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది జయశంకర్ సార్ అని అన్నారు.
* దాదాపు ఆరు దశాబ్దాల నుండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నాయకుడు అని అన్నారు. గల్లి నుండి ఢిల్లీ దాకా డిల్లి నుంచి అమెరికా దాకా తెలంగాణ భావజాలాలను వ్యాప్తి చెందించి ఎంతోమంది విద్యార్థులను వారి మార్గదర్శకంలో నడిపించారు అని అన్నారు.
* ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాకముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరణించడం చాలా బాధాకరమని తెలంగాణలోని అనువణువులో సద్బండ వర్గాల ప్రజల్లో జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగుతాయని అన్నారు.
జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తి తోటి కేసిఆర్ గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చి తీర్చిదిద్దారని అన్నారు.* బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జయశంకర్ సార్ జయంతి అట్టహాసంగా నిర్వహించేదని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం అని అన్నారు.
ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చెంది తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇప్పుడు మళ్లీ పరాయి పాలనలోకి తెలంగాణ వెళ్లి తెలంగాణ తల్లిని మార్చడం అంటే జయశంకర్ సార్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.
జయశంకర్ సార్ ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీవీ సత్యం రూరల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు పట్టణ ఉప అధ్యక్షుడు వొళ్ళం మల్లేశం పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్ మాజీ జడ్పీటీసీ మహేష్ మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ ఆసిఫ్ నాయకులు ఎల్లా రాజన్న గంగాధర్ దయాల మల్లారెడ్డి దామోదర్ రావు వెంకటేశ్వర్ రావు కొరిగంటి రాము గంగిపెల్లి వేణు గాజుల శ్రీనివాస్ పెండెం గంగాధర్ ప్రతాప్ హరీష్ ప్రణయ్ భగవాన్ బాలే చందు జావిద్ ఫహద్ సల్మాన్ భూమేష్ ప్రశాంత్ విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు సంకోజీ రమణ కర్ర కారుశ్రామిక సంఘం అధ్యక్షులు కుంభోజు నారాయణ, గాదోజు నిరంజన్ ఆచారి పడకండి నరహరి, రంగోజి నారాయణ, పెగడపల్లి శీను, నాంపల్లి రామస్వామి తొగిడి గంగాధర్ బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్ తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు
