కొండగట్టులో కోతులకు శాశ్వత ఆహారంకై మొక్కలు నాటిన రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థులు
సహకరించిన నేచర్ లవర్ ఫౌండేషన్, అటవీశాఖ అధికారులు
మల్యాల ఆగస్ట్ 07 (ప్రజా మంటలు):
కొండగట్టులో కోతులకు భవిష్యత్తులో శాశ్వత ఆహారం అందించడానికి మొక్కలు నాటాలనే సంకల్పంలో రామకృష్ణ& ఎన్ ఎస్ వి విద్యార్థుల ముందడుగు వేశారు.కొండగట్టు ప్రాంతంలో కోతులకు శాశ్వత ఆహారం అందించాలని ఒక సదుద్దేశంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు నేచర్ లవర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అల్లనేరేడు ,రేగు, సీతాఫల్ ,మేడి, చింత లాంటి అనేక రకాల 500కు పైగా పళ్ళ మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి దర్శనానికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ క్రమంలో చాలామంది ప్రతిరోజు కోతులకు ఆహారాన్ని అందించినప్పటికీ వాటికి సరిపోయేంత ఆహారం లభించకపోవడం లేదా ప్రతిరోజు భక్తులు ఆహారాన్ని అందించకపోవడం ద్వారా అడవిలో ఉండాల్సిన వానరాలు ప్రజా క్షేత్రంలోకి వస్తున్నాయి.
ఇలా రోడ్లపైకి రావడం వల్ల యాక్సిడెంట్ రూపంలో గానీ సరియైన ఆహారం లభించకపోవడం వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంది పూర్వకాలం నుండి అన్ని పురాణాల ప్రకారం కోతుల నుండి మనుషులుగా మారిన మనం ప్రతిరోజు ఎన్నో అవసరాల నిత్య అటవీ ప్రాంతాలను నరికి వేస్తూ అటవీ ప్రాంతాలలో లభించే పళ్ళ మొక్కలను మానవ అవసరాల నిమిత్తం వాటిని నరికి వేయడం ద్వారా రాబోయే రోజులలో వాటికి ఆహారం లభించడం చాలా కష్టమవుతుంది కాబట్టి భవిష్యత్తులో రాబోయే కారణాన్ని గుర్తించి ముందుగానే నేచురల్ లవర్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా శాశ్వతంగా కోతులకు ఆహారాన్ని అందించాలంటే, ఇప్పటినుండే అడవి ప్రాంతంలో వివిధ రకాల పళ్ళ మొక్కలను నాటి, వాటిని సంరక్షిస్తే అవి రాబోయే రోజులలో కోతులకు సరిపోయే ఆహారాన్ని అందించడానికి వీలవుతుందని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మరియు ఎన్ఎస్వి విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ గారు మరియు రామకృష్ణ విద్యాసంస్థల డైరెక్టర్ పి నరేష్ గారు రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రాజేందర్ గారు శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముసపట్ల రాజేందర్ గారు మరియు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోపు మునీందర్ రెడ్డి గారు మరియు నేచర్ లవర్ ఫౌండేషన్ నిర్వాహకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అటవీ రేంజర్ గులాం మొయినుద్దీన్, దేవస్థానం సూపరింటెండెంట్
సునీల్ కుమార్, ఉపరేంజ్ అధికారి R . మోనిక, అటవీశాఖ ఉద్యోగులు T.రత్నమ్మ, E.ప్రవీణ్ కుమార్,G.రాజేశం, N.మహేందర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే ప్రతీ సంవత్సరం,ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి విద్యా సంస్థ తీసుకుని, సంవత్సరంలో ఒకరోజు ప్రతి విద్యార్థిచే ఒక మొక్క నాటించే కార్యక్రమాన్ని తీసుకోవాలని సూచించారు.
ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నేచర్ లవర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న విద్యార్థులు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుండాలని కోరారు.
ఈ సందర్భంగా నేచర్ల వారు ఫౌండేషన్ నిర్వాహకులునేచర్ లవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శేఖర్ వంకాయల ట్రస్టీ బొద్దుల శ్రవణ్ కుమార్ కార్యదర్శి రామ్ కిషన్ ప్రచార కార్యదర్శి మీనాక్షి వంకాయల జ్యోతి లతోపాటు ప్రముఖ సామాజికవేత్త కోటా శ్యాం కుమార్ తదితరులు మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా సులువు, కానీ వాటిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ వాటికి సరియైన సమయంలో నీటిని అందిస్తూ మొక్కలను కొన్ని రోజుల వరకు కాపాడినప్పుడే అది చెట్టు గా ఎదుగుతుంది అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని, కాబట్టి మేము చేసే ఈ ప్రయత్నంలో మీ వంతుగా ఎవరైనా దాతలు ఉంటే నేరుగా మమ్ములను సంప్రదించి లేదా మా ఫోన్ నెంబర్ 8331053474 ద్వారా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా కానీ మాకు చేయూతనివ్వాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
