తండ్రి సమాధికి రాఖీ కట్టిన కూతురు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగస్టు 09 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ అనేది సోదర సోదరీమణుల మధ్య ప్రేమ.. రక్షణ బంధాన్ని సూచించే పండుగ.ఈ బంధాన్ని భార్యాభర్తలు, తండ్రి-కూతురు, స్నేహితులు లేదా ఇతర ముఖ్యమైన వ్యక్తులతో కూడా జరుపుకోవచ్చు.రాఖీ కట్టడం అనేది ఒకరికొకరు రక్షణ,ప్రేమను తెలియజేసే ఒక సంకేతం.
ఒక కూతురు తన తండ్రికి రాఖీ కట్టడం ద్వారా, వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని.. తండ్రి తన కూతురికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని తెలియజేస్తుంది.
కాబట్టి, రక్షాబంధన్ రోజున కూతురు తన తండ్రికి రాఖీ కట్టడం అనేది వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక్కడ చూస్తున్న చిత్రంలోని ఫోటో తండ్రి కూతురు బంధానికి ప్రతీక నిలుస్తుంది.గొల్లపల్లి మండలం భీంరాజ్ పల్లి గ్రామానికి చెందిన బొమ్మెన మాధవి పెద్దపల్లి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన తన తండ్రి రాజయ్య రెండేళ్ల క్రితం పఠాన్మరణం చెందారు.
ప్రతి ఏటా తన తండ్రి కి కూతురు రాఖీ పండుగకు రాఖి కట్టడానికి వెళ్ళేది.
తండ్రి ఉంటే కట్టేదాన్ని.. కానీ తండ్రి లేకపోవడంతో బాధపడ్డ ఆ కూతురు ఆ బాధను దిగ మింగు కొని రాంపల్లిలోని తన తండ్రి సమాధి వద్ద కు వెళ్లి రాఖీ కట్టింది.తండ్రి కి ఇష్ట మైన పదార్థాలు చేసి పెట్టి మొక్కి రాఖీ కట్టి తండ్రి కూతురు రాఖీ బంధన్ని గుర్తుచేసుకుంది. ఆమెతోపాటు ఆమె కూతురు తాత సమాధికి కూడా రాఖీ కట్టడం రక్షాబంధన్ కు ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
