వృత్తి నిబద్దతతోనే ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు
కోవిడ్ పాండమిక్ లో డాక్టర్ శ్రవన్ సేవలు ఎంతో విలువైనవి
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రవన్ కు వీడ్కోలు
సికింద్రాబాద్, ఆగస్టు07 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ పొరిక శ్రవణ్‌కుమార్ పేషంట్లకు అందించిన సేవలు అభినందనీయమని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. ఇందిర, సూపరింటెండెంట్ డా. రాజకుమారిలు అన్నారు. గాంధీలో విధులు నిర్వహిస్తు ప్రమోషన్పై అడిషనల్ డీఎంఈ, సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ట్రాన్స్ ఫర్ అయిన శ్రవణ్‌కుమార్‌కు గురువారం గాంధీ అలుమ్నీ ఆడిటోరియంలో వీడ్కోలు అభినందనసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతు..తన అంకితభావమైన వృత్తి నిబద్దతతో గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికే వన్నె తెచ్చిన శ్రవణ్‌కుమార్ మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. సహనం, ఓర్పు, చిత్తశుద్ధి, ఇష్టంతో విధులు నిర్వహించే విజయం సాధించవచ్చని, కరోన పాండమిక్ సమయంలో గాంధీ సూపరింటెండెంట్‌గా, కోవిడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా మెరుగైన సేవలు అందించిన శ్రవణ్‌కుమార్ వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించారని కొనియాడారు.
సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీనే ఎంచుకునేందుకు ఆయనే రోల్ మోడలని పలువురు పీజీ డాక్టర్లు స్పష్టం చేశారు. మూడు పద్మశ్రీ అవార్డుల గ్రహీత, ఏఐజీ ఆస్పత్రుల వ్యవస్థాపకఛైర్మన్ నాగేశ్వరరెడ్డి వద్ద తాను గ్యాస్ట్రోఎంట్రాలజీలో నైపుణ్యం నేర్చుకున్నానని, వైద్యవిద్యలో మాత్రమే తన మొదటి గురువు విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు అని శ్రవణ్‌కుమార్ వివరించారు. తన సేవలను గాంధీ వైద్య విద్యార్థులు, పేషంట్లకు జూమ్ మీటింగ్స్ ద్వారా అందిస్తానని స్పష్టం చేశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.
కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఆర్‌ఎంఓ–1 శేషాద్రి, శ్రవణ్‌కుమార్ తండ్రి ధనుంజయ, వైద్యులు సునీల్‌కుమార్, రమేష్, రామన్న, అభిలాష్, భరణీ, ఈశ్వర్, రమాకాంత్, వెంకటేష్ రోమన్, గాంధీ మేనేజర్ వెంకట రమణ, అసిస్టెంట్ మేనేజర్ శివరామిరెడ్డి, పీజీలు, వైద్యవిద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
