టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు
జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు)
భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం సభ్యుల కు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముదరాజు, సిరికొండ రాజన్న ఉపాధ్యక్షులు ఇట్యాల రాము గదాసు రాజేందర్ పవన్ సింగ్ బిజెపి కార్యదర్శి గడ్డల లక్ష్మీ బిజెపి కోశాధికారి మర్రిపల్లి సాగర్ మరియు బిజెపి కార్యవర్గ సభ్యులు తిరుపుర రామచంద్రం కడార్ల లావణ్య తదితరులు పాల్గొన్నారు.
*ముస్లిం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టు యూనియన్ నాయకుల సన్మానం. *
ఇటీవల ఎన్నికల్లో గెలిచిన జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ బారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా మీడియా ఉందని, మీడియాలో వచ్చిన కథనాలతో సమాజంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మీడియా సభ్యులను గుర్తించి తమకు సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి, సిరిసిల్ల వేణుగోపాల్,ఉపాధ్యక్షులు హరికృష్ణ, హైదర్ ఆలి సహాయ కార్యదర్శులు చంద్రశేఖర్, నరేష్, ట్రెజరర్ సిరిసిల్ల వేణుగోపాల్ , కార్యవర్గ సభ్యులు సభ్యులు మనోజ్, సాకేత, జమీర్ అలీ, శమ్ము గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ ఇతర నాయకులు ఖాజా లియాఖాత్ అలీ మోసిన్ ,మహ్మద్ సాజిద్, పట్టువారి, మహ్మద్ ఇర్ఫాన్ ఇబ్రహీం, ఆదిల్ పటేల్, ఖాజా అఖిల్ ఉద్దీన్ జావేద్, డాక్టర్ అయూబ్ ఖాన్, పట్టువారి షకీల్, షిరాజ్ అమీన్ అడ్వకేట్, మక్సర్ అలీ నిహాల్, మహ్మద్ తాహిర్ పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
