ద్వితీయ భాషగా తెలుగు అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వండి ;- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
స్టే ఇవ్వడానికి నిరాకరణ
హైదరాబాద్ ఆగస్ట్ 08:
ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును దశల వారీగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జి, ఇతర జాతీయ బోర్డు పాఠశాలల్లో ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 7, 19 తేదీల్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రమీలా పాతక్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మొదట 6వ తరగతిలో తెలుగును ప్రవేశపెట్టి, క్రమంగా సంవత్సరానికి ఒక తరగతికి చొప్పున పెంచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఒక్కసారిగా తప్పనిసరి చేస్తే.. ఇతర భాషల్లో చదివిన వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, పలు ప్రైవేటు పాఠశాలల్లో ఈ విధానం అమలవుతోందన్నారు. ప్రస్తుతం పిటిషనర్లు 6వ తరగతి నుంచి తెలుగును అమలు చేయకూడదంటున్నారని గుర్తుచేశారు. వాదనలను విన్న ధర్మాసనం తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తెలుగును ద్వితీయ భాషగా దశలవారీగా అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
CBSE 9వ తరగతిలో ఓపెన్ బుక్ పద్దతి పరీక్షలు
.jpeg)
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ -మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

స్కామ్ లతో సింగరేణిని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత
.jpg)
మెట్టుగూడ మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

రోగనిరోధక శక్తి ఎక్కువైతే పిల్లలకు ముప్పే - కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు

ఫుట్ పాత్ అనాధలకు రాఖీలు కట్టిన స్కై ఫౌండేషన్ సభ్యులు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన
