భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం "చేనేత" కళ..మగ్గం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి ఆగష్టు 07 (ప్రజా మంటలు)
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది "చేనేత" కళ అని గొల్లపల్లి మండల పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య అన్నారు. గురువారం గొల్లపల్లి మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గొల్లపల్లి పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి చేనేత మగ్గం మార్కండేయ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం చేనేత కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. మనిషికి నాగరికతను అద్దింది నేత కార్మికులని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుంచే మన దేశంలో మగ్గాల ద్వారా చేనేత ఉత్పత్తి జరిగిందని మొదట్లో ఈ విధానంతో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేదన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన జాన్ కే 1733 లో ఫ్లై షటిల్ ను కనిపెట్టాక మగ్గం ద్వారా వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరిగింది అన్నారు.1801 లో జోసెఫ్ ఎం జాకార్డ్ పెద్ద డిజైన్లు రూపొందించే పరికరాన్ని తయారు చేయగా ప్రస్తుతం చేనేత రంగంలో ఉపయోగిస్తున్నారని ఆ పరికరాన్ని జాకార్డ్ గా పిలువ పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి మండల పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య గొల్లపల్లి పట్టణ అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి ,కార్యదర్శి అందే లక్ష్మణ్, కోశాధికారి ఇంకా లింబాద్రి , మండల పద్మశాలి నాయకులు అలిశెట్టి రవీందర్, కొక్కుల భూమయ్య, ఓడ్నాల అంజయ్య,కొక్కుల జలంధర్, సాంబారీ అర్జున్ ,గుంటుకల మహేందర్, వెంగల్ దాస్ మల్లేశం, ఎలగందుల సత్తయ్య,గుండ మహేష్, కొక్కుల బుచ్చన్న, కటకం రమేష్, కొండయ్య, కొక్కుల సత్తయ్య, అందే శ్రీనివాస్ ,గాజంగి సత్తయ్య, అనుమల వెంకటస్వామి, అంకం లక్ష్మీనారాయణ, కొండ వత్తిని రమేష్, సుదర్శన్ ,రఘు, సాంబయ్య,వివిధ గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు కార్యదర్శులు,పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
