రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత
నాకు బలి ఇచ్చి, రక్తం చూపించాలి...లేనట్లయితే అల్లకల్లోలం చేస్తా..
- నాకు ఇబ్బంది కలిగించిన వారు రక్తం కక్కుకుంటారు..
- ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయి..
- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ జూలై 14 (ప్రజామంటలు) :
ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి... పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.... కానీ రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయి... జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో ప్రధాన ఘట్టమైన 'రంగం' కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గర్బగుడిలో అమ్మవారికి ఎదురుగా పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా తల్లీ?.. అని అర్చకులు ఆమెను ప్రశ్నించగా , అందుకు మాతంగి స్వర్ణలత సమా ధానం చెబుతూ.. ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని వెల్లడించారు. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. మీ అరికాలిలో ముల్లు నాలుకతో తీస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను" అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. "బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. కానీ, ప్రతి ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని.. ఎవరూ లెక్కచేయడం లేదని ఆగ్రహించారు.రాశులకొ ద్దీ రప్పించుకుంటున్నారు... గోరంతై నా తనకు దక్కడం లేదు, నాకు సక్రమంగా పూజలు చేయడం లేదు.. మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు..మీరు అన్నీ అరగిస్తారు..నాకు మాత్రం ఇవ్వడం లేదు...ప్రతి సారి లాగే ఈ సారి కూడ పొరబాట్లు చేశారు... అయినా నేను అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న అన్నారు.జరుగుతున్న పరిణామాలకు నా పాత్ర ఉంటుంది.. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు... నాకు ఎవరైతే ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తారో వాళ్లు రక్తం కక్కుకుంటా రు. నాకు పూజలు చేసి రక్తం చూపించండి.. నాకు తప్పనిసరిగా అన్ని విధివిధానాల ప్రకారం పూజలు జరిపించండి. ఏటికొక్కసారి నాకు ఇలా పూజలు జరిపించాలి. నాకు ఐదు వారాల పాటు పూజలు చేసి, పప్పు, బెల్లంతో సాక పోసి ఆనందపరచండి...నన్ను కొలిచే నా అక్కచెల్లెలు అందరికీ అండదండగా ఉంటాను అని భవిష్యవాణి వినిపించారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా.కోట నీలిమా పాల్గొన్నారు.
భవిష్యవాణి వినిపించిన స్వర్ణలతకు కుంకుమబెట్టిన జిల్లా కలెక్టర్ హరిచందన ఈసందర్బంగా ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ఎండోమెంట్ అధికారులు, ఆలయ అర్చకులతో కలసి పొతరాజులతో పొటోలు దిగారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
