కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు
పలు చోట్ల హాజరైన శ్రీగణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్
సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినం సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఢిల్లీలో టిపిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో పాల్గొంటున్నందున నియోజకవర్గంలో అభిమానులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండుగగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పలు చోట్ల ఎమ్మెల్యే తనయుడు,శ్రీగణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ పాల్గొన్నారు.నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలలో, చర్చిలలో , మజీద్ లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేరిట పూజలు, ప్రార్థనలు నిర్వహించి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలో పలు చోట్ల అన్నదానాలు, హాస్పిటల్స్ లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు , శ్రీగణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఎమ్మెల్యే పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రికి వెళ్ళి బ్లడ్ డోనేషన్ చేశారు. ప్రజాసేవలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ తరిస్తూ, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
