బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం
కాంగ్రెస్ అలా కాదు...నిరంతరం ప్రజా సంక్షేమానికే అంకితం
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం...రేషన్ కార్డులు ఇస్తున్నాం..
- కంటోన్మెంట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఆగస్ట్ 01 (ప్రజామంటలు) :
బీఆర్ఎస్ హాయంలో కేవలం ఉప ఎన్నికలు వస్తేనే కొత్త స్కీంలు, సంక్షేమ పథకాలను తెరమీదకు తెచ్చేవారని కాని కాంగ్రెస్ అలా కాదని, ప్రతి నిత్యం నిరంతరం ఎన్నికలకు సంబందం లేకుండా..ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నామని రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గం బాలంరాయి లో నిర్వహించిన కార్యక్రమంలో 1150 నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే శ్రీగణేశ్, కలెక్టర్ హరిచందన దాసరి లతో కలసి లబ్దిదారులకు అందచేశారు.
ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ...మొన్నటి వరకు తెలంగాణ రాష్ర్టంలో బోనాల పండుగ వేడుకలు జరిగాయని, గత దశాబ్దం కాలం నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల మంజూరీతో మరో పండుగ వాతావరణం నెలకొందన్నారు. రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు ఎప్పుడైన దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి గడువు ఏమీ లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్కార్డు ఇస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేశ్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరో 3 నుంచి 4 వేల వరకు రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని త్వరలో వీటిని మంజూరీ ఇప్పిస్తామన్నారు. పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
గత బీఆర్ఎస్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంలో కుట్ర దాగి ఉందని, రేషన్ కార్డులు ఇస్తే అన్ని పథకాలను ఇవ్వాల్సి వస్తుందనే... రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదవాళ్ళ ఉసురు పోసుకుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి మండలి సమిష్టి కృషితో రాష్ర్ట ప్రజల రేషన్ కార్డుల కల ఫలించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి,అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటేడ్ మెంబర్ భానుక నర్మద మల్లికార్జున్,కార్పొరేటర్ కొంతం దీపిక,సివిల్ సఫ్లై అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి
