సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు.జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్
జగిత్యాల జూన్ 20(ప్రజా మంటలు)
జిల్లాలోని లింగంపేట్ గ్రామంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు .
రాబోయే 3 నెలల పాటు పారిశుధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పారిశుద్ధ్య కమిటీలలో వైద్య శాఖ సిబ్బంది భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఆశా కార్యకర్తల దగ్గర అన్ని విధాల మందులు జ్వరం దగ్గు సీజనల్ వ్యాధులు సంబంధించి ప్రజలకు అవసరమైన మేర అందించాలని అన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం గ్రామాలలో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని,
డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు.
ప్రతి శుక్రవారం గ్రామంలో 30 ఇండ్లు తిరిగి పూర్తి స్థాయిలో డ్రై డే పాటించేలా చూడాలని, గ్రామాలలో రెగ్యులర్ గా ఫాగ్గింగ్ చేయాలని అన్నారు .
జూన్ 25 నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్.ఎం.ఓ లు సీజనల్ వ్యాధులకు అందించాల్సిన వైద్యం పట్ల సమావేశాలు నిర్వహించాలని
వైద్యశాఖ అధికారులు స్థానిక సంస్థల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గతంలో అధికంగా కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు
