నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జూన్ 20(ప్రజా మంటలు)
జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్ సి) కోసం శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గారు స్థల పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – ‘‘ఇళ్లను కేటాయించిన లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. అంగన్వాడి, పాఠశాల, ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాల ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని పేర్కొన్నారు.
స్థల పరిశీలన సమయంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన ప్రణాళికలను రూపొందించి, పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ , డబుల్ బెడ్‌రూమ్ పీడీ ప్రసాద్, ఇంజినీరింగ్ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
