ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
గొల్లపల్లి జూలై 15 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆయిల్ పామ్ తోటల సాగు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా రైతు బుర్రవేణి తిరుపతి క్షేత్రంలో 6 ఎకరాలలో కలెక్టర్ ఆయిల్ పామ్ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలనుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగుననితెలిపారు.
ఆయిల్ ఫామ్ మొక్కలను 90% సబ్సిడీ పై 20 రూ./- లకే ఇస్తున్నామని, డ్రిప్ పై 80%-100% సబ్సిడీ అందిస్తున్నామని, ప్రతి ఎకరానికి 4200/- సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 4700 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ళ వానలవల్ల నష్టం ఉండదని, కోతుల బెడద ఉండదని,1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం గెలలను ప్రభుత్వం నిర్దారించిన రేట్ కు కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం ఆర్డిఓ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్, తాసిల్దార్ వరంధన్ , మండల వ్యవసాయ అధికారి కరుణశ్రీ, ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీ ఓ సురేష్ రెడ్డి,ఉద్యాన , వ్యవసాయ విస్తరణ అధికారి, ప్రజా ప్రతినిధులు, మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, లోహియా, డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు అనంతుల భూమయ్య, ముస్కు నారాయణరెడ్డి, నల్ల సతీష్ రెడ్డి,రత్నాకర్ రెడ్డి,పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
