బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం
మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్
సికింద్రాబాద్, జులై 14 (ప్రజామంటలు)
సికింద్రాబాద్ లష్కర్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా, శుక్రవారం మినీ జాతరగా తలపించే రోజు తోపాటు ఆదివారం బోనాల పండుగ సందర్భంలో, సోమవారం రంగం, అంబారి ఊరేగింపులో తమదైన శైలిలో భక్తి పరవశంతో క్రమం తప్పకుండా మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో 48 మంది బృందాలుగా ఈ జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సేవలను తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు వాలంటరీలకు సిబ్బందికి వాటర్ మంచినీళ్ల బాటలను మంచి నీటి ప్యాకెట్లను అందించడంతోపాటు దర్శనానికి విచ్చేసే భక్తులకు క్యూ లైన్ ల పై అవగాహన కల్పిస్తూ బోనాలు ఎత్తుకొని వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అండగా ఓపికగా నిలబడి అమ్మవారిని దర్శించుకోవాలని చెబుతూ వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలను వివిధ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలలో రూట్ మ్యాప్ లను బ్యానర్లను పోలీసు ఉన్న అధికారుల సూచన మేరకు ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమదైన శైలిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అనే టీ షర్టులను ధరించి ప్రచారం చేస్తూ సేవలు అందించడం గమనార్ధం. వికలాంగులకు వయోవృద్ధులకు కూడా తమదైన శైలిలో సేవలు అందిస్తూ జాతరలో ముందుకు సాగారు.
వారి సేవలను గుర్తించిన ఉజ్జయిని మహాకాళి ఆలయ ఈ.వో మనోహర్ రెడ్డి జలంధర్ గౌడ్ తో పాటు వారి బృందాన్ని ఆయన కార్యాలయంలో సత్కరించి అమ్మవారి చీరలను అందజేశారు. ఆయనతోపాటు సేవ కార్యక్రమంలో ఆయన బృందం సభ్యులు నరసింహ చారి, శివ రతన్, అర్చన, నిఖిత, శివకుమార్, కే.వేణు, కే. వెంకటేష్, ఎం.శేఖర్ గౌడ్, పూర్ణచందర్, వెంకటాచారి, రాజశేఖర్, బాలరాజ్, ఎం. శశాంక్, కృష్ణ, రజిత, రాధిక, పి.సాయి ప్రియ, పి. వెంకట సాయి, మణిదీప్, అంజి, వై శ్రీలత, వి.ప్రణవ్ సాయి, నిఖిత్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం
