ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి
గొల్లపల్లి జూలై 14 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు ఉన్నత పాఠశాలలో 2025 పి ఆర్ టి యు సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీ ఆర్ టీ యు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్ నాథ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పీ ఆర్ టీ యు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీ ఆర్ టీ యు సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియజేశారు.
భవిష్యత్తులో అన్ని రకాల జిపిఎఫ్, సరెండర్ , టి ఎస్ జి ఎల్ ఐ. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసిందన్నారు.
అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డులు వర్తించేటట్లు త్వరలో ఉత్తర్వులు విడుదలవుతాయని అన్నారు.
2024 సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం ప్రాతినిధ్యO చేసిందన్నారు . 2024 డీఎస్సీ ఉపాధ్యాయులకు అక్టోబర్ 10వ తేదీ నుంచి వేతనాలు చెల్లించే విధంగా ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి ఆధ్వర్యంలో పీ ఆర్ టీ యు ప్రాతినిధ్యం మేరకు ఉత్తర్వులు విడుదల కావడం జరిగిందన్నారు . ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ కు సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వ నిబంధన మేరకు జీవో.25,11 లకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పాఠశాల విద్యా సంచాలకులకు ప్రాతినిధ్య చేసిందన్నారు..
బదిలీలతో కూడిన పదోన్నతులకు పీ ఆర్ టీ యు సంఘం కట్టుబడి ఉందని త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేయడానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందన్నారు.
మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలి. కేజీబీవీ టీచర్లకు ఆప్షనల్ హాలిడేస్ వాడుకునెలా ఉత్తర్వులు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పీ ఆర్ టీ యు గొల్లపల్లి మండల అధ్యక్షులు రాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవేందర్., రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చెన్న కరుణాకర్, సంధి శ్రీనివాస్ రెడ్డి, అయిల్నెని రత్నాకర్ రావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రశాంతి, జిల్లా కార్యదర్శి నరేందర్ లక్ష్మణ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
