విద్యాభివృద్ది కై చిత్తశుద్దితో సీఎం రేవంత్ కృషి - బడి బాట ముగింపులో ముఖ్య అతిథిగా చిన్నారెడ్డి
సికింద్రాబాద్, జూన్ 19 (ప్రజామంటలు) :
రాష్ట్రంలో విద్యా శాఖను బలోపేతం చేయడంతోపాటు విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని , పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తే ఆయా పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని రాష్ర్ట ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించిన బడి బాట గురువారం ముగింపు కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ లోని చిలకలగూడ దూద్ బావి ప్రభుత్వ ప్రైమరీ ఆంగ్ల మీడియం స్కూల్ లో జరిగిన ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రైమరీ స్కూల్ చిన్నారులతో చిన్నారెడ్డి అక్షరాభ్యాసం చేయించారు.
హెచ్.ఎం. మల్లికార్జున్ రెడ్డి స్కూల్ కోసం చేస్తున్న కృషిని చిన్నారెడ్డి కొనియాడారు. మాతృ భాషతోపాటు ఆంగ్ల, హిందీ భాషల్లో విద్యార్థులకు విద్యా బోధన, భాషా పరిజ్ఞానం ఉండాలని, ఉపాధ్యాయులు అందు కోసం పాటు పడాలని చిన్నారెడ్డి సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం, స్కూల్స్ తిరిగి తెరిచేలోపే యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందించడం రేవంత్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయాలని చిన్నారెడ్డి అన్నారు. విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని, ప్రభుత్వ స్కూల్ లో చదువుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు కూడా హాజరై చిన్నారులకు ఆశీర్వదించారు. కన్నుల పండువగా ఈ కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్య ప్రకాష్, డిప్యూటీ డీఈవో శ్రీధర్,ఎంఈవో మదన్ మోహన్ రెడ్డి, అమ్మ కమిటీ అధ్యక్షులు ప్రేమదేవి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు
