దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం
దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు తప్పుడు పిర్యాదులు చేయించిన వారిపై పరువు నష్టం దావా తప్పదు
నక్క రాజలింగును నిండా ముంచేందుకు కుట్రలు చేస్తున్న దోపిడీ దారులు - నిధుల దుర్వినియోగంలో క్రిమినల్ కేసులు తప్పవు
చట్టాలు దోపిడీ దారులకు చుట్టాలు కాదు - తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపణ
బుగ్గారం :
ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకున్న దొంగలు అంతా కలిసి తనపై తప్పుడు ఆరోపణలతో దొంగ పిర్యాదులు చేయించారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన బుగ్గారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేఖరులతో మాట్లాడారు.
బుగ్గారం గ్రామానికి చెందిన నిరుపేద దళిత వృద్దుడు నక్క రాజలింగు కు మద్యం త్రాగించి, మాయ మాటలు చెప్పి తప్పుడు, అసత్యపు ఆరోపణలతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనపై పిర్యాదు చేయించారని ఆయన వివరించారు. బుగ్గారం గ్రామ పంచాయతీ లో జరిగిన భారీ నిధుల దుర్వినియోగం, భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు, ఇతర అవినీతి, అక్రమాలను బయట పెట్టినందుకే కుట్ర పూరితంగా తనపై తప్పుడు ఆరోపణలతో నక్క రాజలింగును పావుగా వాడుకుంటున్నారని అన్నారు.
నక్క రాజలింగుకు జరిగిన అన్యాయంపై చట్టబద్ధంగా, భారత రాజ్యాంగ బద్దంగా ధర్మంగా న్యాయ పోరాటం జరుగుతుందని వివరించారు. ఆ పోరాటంలో ఫలించే విజయం ద్వారా నక్క రాజలింగు చేకూరే సుమారు రూ.8,40,000 ఎనిమిది లక్షల నలభై వేల రూపాయల లబ్ధిని చెడగొట్టేందుకే ఈ దోపిడీ దారులు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఈ దోపిడీ దొంగల్లోని ఒక వ్యక్తే గతంలో కుట్రతో నక్క రాజలింగు కు చెందిన 14 గుంటల భూమిని అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో తొలగించి ఇతరుల పేరున నమోదు చేయించి రాజకీయంగా లబ్ధి పొందినట్లు తెలిసిందన్నారు.
నేడు కూడా అదే వ్యక్తి నక్క రాజలింగుకు భూమి రికార్డుల్లో నమోదు కాకుండా అడ్డుకునే కుట్రల్లో భాగమే ఈ ఎత్తుగడలు, ఈ తప్పుడు పిర్యాదులు అని పేర్కొన్నారు. నక్క రాజలింగు ఒక్కడే కాకుండా అనేక మంది ఈ దోపిడీ దొంగల అరాచకాల వలన భూమిని రికార్డుల్లో కోల్పోయారని వారందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. నిజంగా న్యాయం కోరుకునే వారు ఇలాంటి అసత్యపు ఆరోపణలతో తప్పుడు పిర్యాదులు చేయరని, అస్సలు విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు.
త్వరలోనే ఈ దోపిడీ దారుల, దోపిడీ దొంగల నిజ స్వరూపం కూడా బయట పడబోతుందని, వీరివల్ల ఎంతమందికి, ఎంత నష్టం జరిగిందో... బుగ్గారం గ్రామానికి, గ్రామ ప్రజలకు, పేదలకు, దలితులకు కూడా ఈ దోపిడీ దారుల వలన కలిగిన కష్టాలు, నష్టాలు, నిలిచి పోయిన అభివృద్ధి, వీరు అడ్డుకున్న లబ్ధి, అన్ని వివరాలతో తగిన ఆధారాలతో సహా బయట పెడుతామని చుక్క గంగారెడ్డి తెలిపారు. ప్రజలు అందరినీ, అన్నింటినీ ఎప్పటి కప్పుడు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే ఈ దోపిడీ దొంగలకు తగిన గుణ పాఠం చెప్పి తీరుతారని చుక్క గంగారెడ్డి హితవు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):
ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ... ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత మాట్లాడుతూ... ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం
మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా... ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం
ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో... సైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి:సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా... వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత
ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.పిల్లల పరీక్షల... సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సందర్భంగా సన్మానాలు
జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.
ధర్మపురి... హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):
దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన... మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం
బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్‌కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.... రేచపల్లి లో బావిలో బాలుడి మృతదేహం
జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):
రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ... జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):
హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర... 