నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
సారంగాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు , సిబ్బంది పనితీరు భేష్
సారంగాపూర్ జూన్ 13 (ప్రజా మంటలు)
ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీ లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని,బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు.
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ0లో 5s అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు.
అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.
ముందుగా1993 సంవత్సరంలో సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతార, నేరెళ్ల మధ్యదారిలో రోడ్డు పై మావోయిస్టులు అమర్చిన మందు పాత్రర పేలి అమరుడైన కానిస్టేబుల్ రాజయ్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు ఘటించారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్,డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్
సారంగాపూర్ ఎస్.ఐ లు దత్తాద్రి, సదకర్, కుమారస్వామి, సుధీర్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష
