జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
సమావేశం లో మాట్లాడుతున్న రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం
ఎల్కతుర్తి జూన్ 13 (ప్రజామంటలు) :
జాతీయ వ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న లోక్ అదాలత్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) వరంగల్ అర్బన్ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీమ్ షేక్ సూచించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని సెర్ఫ్ కార్యాలయలో రైతులకు స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చే రుణాలు, బ్యాంకు ద్వారా అందుతున్న సేవలను వివరించారు. శనివారం జాతీయ వ్యాప్తంగా లోక్ అదాలత్ ఉన్నదని, వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మేనేజర్లు ఆధ్వర్యంలో జరిగే లోక్ అదాలత్ లో పాల్గొని మొండి బకాయలను పరిష్కరించుకోవాలని ఎల్కతుర్తి ఎస్ బీ ఐ బ్రాంచ్ మేనేజర్ దేవుసింగ్ సూచించారు. కార్యక్రమం లో ఏపీఎం రవీందర్, సీసీ లు మరియు రైతులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
