దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం
దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు తప్పుడు పిర్యాదులు చేయించిన వారిపై పరువు నష్టం దావా తప్పదు
నక్క రాజలింగును నిండా ముంచేందుకు కుట్రలు చేస్తున్న దోపిడీ దారులు - నిధుల దుర్వినియోగంలో క్రిమినల్ కేసులు తప్పవు
చట్టాలు దోపిడీ దారులకు చుట్టాలు కాదు - తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపణ
బుగ్గారం :
ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకున్న దొంగలు అంతా కలిసి తనపై తప్పుడు ఆరోపణలతో దొంగ పిర్యాదులు చేయించారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన బుగ్గారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేఖరులతో మాట్లాడారు.
బుగ్గారం గ్రామానికి చెందిన నిరుపేద దళిత వృద్దుడు నక్క రాజలింగు కు మద్యం త్రాగించి, మాయ మాటలు చెప్పి తప్పుడు, అసత్యపు ఆరోపణలతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనపై పిర్యాదు చేయించారని ఆయన వివరించారు. బుగ్గారం గ్రామ పంచాయతీ లో జరిగిన భారీ నిధుల దుర్వినియోగం, భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు, ఇతర అవినీతి, అక్రమాలను బయట పెట్టినందుకే కుట్ర పూరితంగా తనపై తప్పుడు ఆరోపణలతో నక్క రాజలింగును పావుగా వాడుకుంటున్నారని అన్నారు.
నక్క రాజలింగుకు జరిగిన అన్యాయంపై చట్టబద్ధంగా, భారత రాజ్యాంగ బద్దంగా ధర్మంగా న్యాయ పోరాటం జరుగుతుందని వివరించారు. ఆ పోరాటంలో ఫలించే విజయం ద్వారా నక్క రాజలింగు చేకూరే సుమారు రూ.8,40,000 ఎనిమిది లక్షల నలభై వేల రూపాయల లబ్ధిని చెడగొట్టేందుకే ఈ దోపిడీ దారులు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఈ దోపిడీ దొంగల్లోని ఒక వ్యక్తే గతంలో కుట్రతో నక్క రాజలింగు కు చెందిన 14 గుంటల భూమిని అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో తొలగించి ఇతరుల పేరున నమోదు చేయించి రాజకీయంగా లబ్ధి పొందినట్లు తెలిసిందన్నారు.
నేడు కూడా అదే వ్యక్తి నక్క రాజలింగుకు భూమి రికార్డుల్లో నమోదు కాకుండా అడ్డుకునే కుట్రల్లో భాగమే ఈ ఎత్తుగడలు, ఈ తప్పుడు పిర్యాదులు అని పేర్కొన్నారు. నక్క రాజలింగు ఒక్కడే కాకుండా అనేక మంది ఈ దోపిడీ దొంగల అరాచకాల వలన భూమిని రికార్డుల్లో కోల్పోయారని వారందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. నిజంగా న్యాయం కోరుకునే వారు ఇలాంటి అసత్యపు ఆరోపణలతో తప్పుడు పిర్యాదులు చేయరని, అస్సలు విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు.
త్వరలోనే ఈ దోపిడీ దారుల, దోపిడీ దొంగల నిజ స్వరూపం కూడా బయట పడబోతుందని, వీరివల్ల ఎంతమందికి, ఎంత నష్టం జరిగిందో... బుగ్గారం గ్రామానికి, గ్రామ ప్రజలకు, పేదలకు, దలితులకు కూడా ఈ దోపిడీ దారుల వలన కలిగిన కష్టాలు, నష్టాలు, నిలిచి పోయిన అభివృద్ధి, వీరు అడ్డుకున్న లబ్ధి, అన్ని వివరాలతో తగిన ఆధారాలతో సహా బయట పెడుతామని చుక్క గంగారెడ్డి తెలిపారు. ప్రజలు అందరినీ, అన్నింటినీ ఎప్పటి కప్పుడు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే ఈ దోపిడీ దొంగలకు తగిన గుణ పాఠం చెప్పి తీరుతారని చుక్క గంగారెడ్డి హితవు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
