ప్రజల రుణం తీర్చుకుంటా - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణ పడి ఉన్నాను
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జూన్ 10:
స్థానికేతరుడనైన నాకు సంపూర్ణ మద్దతు తెలిపి, రాజకీయ ఎదుగుదలకు చేయూతను అందించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణ పడి ఉన్నానని, దానిని తప్పక తీర్చుకుంటానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భావోద్వేగంతో ఉద్ఘాటించారు.
రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ లో నూతనంగా మంత్రి పదవి పొంది, ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి మంత్రి హోదాలో మంగళ వారం ధర్మపురి నియోజక వర్గంలో,
క్షేత్రంలో కనీవినీ ఎరగని స్వాగతాన్ని అందుకుని, దైవ పూజాదులలో సెంటిమెంట్ను అనుసరించి, దైవ పూజాదులలో పాల్గొన్న అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2009 నుండి, ప్రతి ఎన్నికలో ఓడినా, ప్రజలతో మమేకమై, సమస్యల సాధనకు కృషి సల్పానని, పార్టీకి వీర విధేయుడనైన తనపై అచంచల విశ్వాస ముంచిన, కాంగ్రెస్ అధిష్టానం, పి సి సి చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సహకరించి, ఖరారు చేశారని, ప్రజల దీవెనలు కోరుతున్నానన్నారు.
పట్టు వస్త్రాల సమర్పణ
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సాయంత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆలయానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల తనకు మంత్రి పదవి లభించిందన్నారు. ఈ పదవి ద్వారా పేదల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని పేర్కొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ధర్మపురి నియోజక వర్గ కేంద్రానికి విచ్చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు స్వాగతం లభించింది. ధర్మపురి నియోజక వర్గంలో పత్తిపాక సమీపం నుండి అడుగడుగునా
కిలోమీటర్ల దూరాన గల ధర్మపురి క్షేత్రం వరకు ఆయనను పూలమాలలతో సత్కరించి, స్వాగతం పలికి, వేలాది ద్విచక్ర వాహనాలపై నాయకులు మిన్నంటిన నినాదాలు చేస్తూ, పార్టీ జెండాలు హస్తాలబూని, భారీ ర్యాలీ నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
