ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
జగిత్యాల మే 26 (ప్రజా మంటలు)
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 59 పిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి వివిధ జిల్లా అధికారులు,తహసీల్దర్లు,కలెక్టరేట్ పర్యవేక్షకులు,
సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి
