కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

On
కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి 

సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పాదయాత్రలు వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుందని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వర రాజేశ్వరి అన్నారు బుధవారం ఆమె మెట్టుగూడలో మీడియాతో మాట్లాడుతూ... అంబేడ్కర్ ను అవమానించి ప్రజాస్వామ్యన్ని కాలరాసిన కాంగ్రెస్ పార్టీ చేసిన దేశద్రోహపు చర్యలను ప్రజలకు తెలియజేస్తామని  పేర్కొన్నారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులు లేని కాశ్మీర్ ను తయారు చేసిందని ఈశాన్య భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా చేసి నిత్యం ఆశాంతికి దారి తీసిందన్నారు.370 ఆర్టికల్, 35(A) లాంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచలేదని అంబెడ్కర్ ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించి 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అంబెడ్కర్ పై నెహ్రు ఇంట్లో పనిమనిషిని పోటీకి దింపి దుష్ప్రచారం చేసి ఓడించిన కాంగ్రెస్ పార్టీకి జై భీమ్ అని ఉచ్చరించే నైతిక హక్కు లేదన్నారు.అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరించి 1975లో ఎమర్జెన్సీ విధించి సెక్యులర్ అనే పదాన్ని చేర్చి అంబెడ్కర్ ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పట్టుబడిన తొంబైమూడు వేల మంది పాక్ సైనికులను వదిలిపెట్టి జయించబడిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ కు బహుమతిగా ఇచ్చిందని 90వేల చ.కి.మీ. భూభాగంతో పాటు కైలాస మానస సరోవరంను చైనాకు అప్పగించిందని, ఇవన్నీ మరచిపోయి పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ బిజెపి హయాంలో అరవైనాలుగు వేల చ.కి.మీ. చైనా ఆక్రమించిందని దుష్ప్రచారం చేసి దేశం పరువుతీస్తున్నాడని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ లో రోహింగ్యాలకు పునరావాసం కల్పించి బంగ్లాదేశ్ ముస్లింలను దేశంలోకి చొప్పించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. NRC ని వ్యతిరేకించి రాత్రి రెండు గంటలకు సుప్రీంకోర్టు తలుపులు తెరిపించి శిక్ష పడిన దేశద్రోహులను రక్షించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

2700 వందల మంది సిక్కులను ఊచకొత కోసి వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా ఆలపించకుండ చేసి 26/11 దాడుల వెనుక హిందువుల హస్తం ఉందని చెప్పిన పార్టీ కాంగ్రెస్ అని 1966లో గోరక్షక ఉద్యమకారలైన సాధుసంతువులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించి వందలాది మంది పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జైబాపు అనే హక్కు లేదన్నారు. హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చి అమర్ నాథ్ యాత్రకు పన్ను వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుజరాత్ లో సర్దార్ పటేల్ సోమనాథ్ మందిరాన్ని నిర్మించుకున్నాడని విరోధించి ప్రారంభోత్సవానికి వెళ్లకుండ అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ను విరోధించిందని ఇంతటి నీచమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీని విమర్శించడం మానుకొని కాంగ్రెస్ చేసిన తప్పులకు దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీకి అంబెడ్కర్ పట్ల గౌరవం ఉంటే 1993 లో భారతరత్న ప్రకటించి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

బీజేపీకి అంబెడ్కర్ పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబెడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించి భారతరత్న ప్రధానం చేసి రాజ్యాంగ విలువలకు లోబడి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొంది మూడవసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి అన్నారు.

Tags

More News...

Local News  State News 

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సబ్ కమిటీకి విజ్ఞాపన హైదరాబాద్ 12 మే (ప్రజా మంటలు): ప్రైవేట్ పాఠశాలలు & జూనియర్ కళాశాలలలో ఫీజు నియంత్రణ కోసం క్యాబినెట్ సబ్-కమిటీ ఈరోజు సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి TRSMA ప్రతినిధి బృందం పాల్గొన్నది. ఈ సమావేశానికి ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షత వహిస్తారు, ఆయన కమిటీ చైర్మన్ కూడా. సమావేశం యొక్క అజెండా:...
Read More...
Local News 

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.

బైక్ ను ఢీకొట్టిన కారు... వ్యక్తితో పాటు చిన్నారి మృతి.                                         జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడ లో సోమవారం రాత్రి  గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. పట్టణంలోని హనుమాన్ వాడ కు చెందిన పాదం మల్లేశం అతని సోదరుడు శేఖర్ కూతురు వితన్వి (18 నెలలు పాప) కు చాకెట్లు కొనివ్వడానికి తమ ఇంటి నుండి దుకాణానికి  బైక్ పై...
Read More...
Local News 

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు.   డిగ్రీ  పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ 

విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు.    డిగ్రీ  పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి   జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే 12(ప్రజా మంటలు ) ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని తొలి జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.  డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలు దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం చేయాలనీ కోరుతూ బీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరెట్...
Read More...
Local News 

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం  - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి గాంధీలో ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, మే12 (ప్రజామంటలు): ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా సోమవారం గాంధీ ఆసుపత్రిలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. ఆమె జయంతి సందర్భంగా కేకును కట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది చేస్తున్న విశేష సేవలు...
Read More...
Local News 

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన సికింద్రాబాద్,మే12 (ప్రజామంటలు): ఫైర్ యాక్సిడెంట్ల నివారణ, ముందు జాగ్రత్తలపై సికింద్రాబాద్ మహాంకాళి పోలీస్ స్టేషన్ పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా సోమవారం పీజీ రోడ్డు లోని ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం అవరణంలో అవగాహన కల్పించారు. ఈసందర్బంగా అధికారులు మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లు, వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానులకు పలు...
Read More...
Local News  State News 

 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా5వ మహాసభలను విజయ వంతం చేయండి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి  మాదన కుమార స్వామి (చుక్క గంగారెడ్డి)జగిత్యాల మే 12 (ప్రజా మంటలు):   ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్...
Read More...
Local News 

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్ 

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్     జగిత్యాల మే 12 ( ప్రజా మంటలు) ప్రతి సోమవారం " విద్యుత్ ప్రజావాణి"  కార్యక్రమం నిర్వహిస్తున్నామని   జగిత్యాల సర్కిల్   సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్  స్పష్టం చేశారు .   విద్యుత్ వినియోగదారులందరికి మరింత  చేరువై వారి సమస్యల పరిష్కార  ధ్యేయంగా  ''విద్యుత్ ప్రజావాణి'' కార్యక్రమం చేపట్టామని  వినియోగదారుల ఫిర్యాదులను తీసుకొని వాటిని సకాలంలో పరిష్కరిస్తున్నామని...
Read More...
Local News 

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసిన వెల్దుర్తి గ్రామ గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు.  వెల్దుర్తి గ్రామంలో ఎల్లమ్మ గుడి సీసీ రోడ్డు మంజూరు చేయాలని, ఎల్లమ్మ గుడిలో వంటశాలకు షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,నాయకులు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 12(ప్రజా మంటలు)    జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News  State News 

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల మే11 ( ప్రజా మంటలు ) :  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బలోపేతంపై సమగ్రంగా సమీక్ష.. ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ & హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డీఎంఈ...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు)    పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 16 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు                                          సిరిసిల్ల రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్  విజయవంతం అయిన సందర్భంగా దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని, వారికి దైవికంగా మంగళాశాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్పస్వామి కి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలను ఆదివారం...
Read More...