ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!
నిధుల దుర్వినియోగం పై చర్యలు ఏవి...?
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - టి.జీవన్ రెడ్డి - బాదినేని రాజేందర్ లే బాధ్యత వహించాలి
లోకాయుక్త తీర్పుకు నాలుగు నెలలు
జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు నెల రోజులా...?
అయినా క్రిమినల్ కేసుల నమోదులో చర్యలు శూన్యం
"ఎంపిఓ" నే ప్రభుత్వాన్ని - న్యాయస్థానాలను మించిన "సుప్రీం"
మీరెందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించిన "చుక్క గంగారెడ్డి
బుగ్గారం ఏప్రిల్ 05::
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన కోటికి పైగా నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ లే పూర్తి బాధ్యత తీసుకొని దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి మొత్తం ప్రజా ధనాన్ని రికవరీ చేయించాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కోరారు.
శనివారం ఆయన బుగ్గారం గ్రామస్తులతో, విడిసి బృందంతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ లోకాయుక్త న్యాయస్థానం నుండి తీర్పు వెలువడి నాలుగు నెలలు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులు గడుస్తున్నా క్రిమినల్ కేసులు నమోదు చేయించడంలో పంచాయతీ అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఇందుకు భారీ అవినీతితో పాటు, రాజకీయ ఒత్తిల్లే కారణమని ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
న్యాయస్థానాలను, అధికార పార్టీని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మించిన "సుప్రీం" గా బుగ్గారం మండల పంచాయతీ అధికారి "అఫ్జల్ మియా" వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఒక ఎంపిఓ ఇంతటి దారుణానికి పాల్పడితే ఇక ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీటిసి బాదినేని రాజేందర్ లు మౌనం పాటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
దీనికి కారకులు ఎవరో మీరే అర్థం చేసుకోవాలని చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ నిధుల దుర్వినియోగం పై ప్రాణాలకు తెగించి, ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఐదున్నర సంవత్సరాలుగా ధర్మంగా, న్యాయంగా, చట్ట బద్దంగా, నీతి - నిజాయితీతో పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల మీద కేసులు వేసి
లోకాయుక్త న్యాయస్థానంలో గెలుపొంది క్రిమినల్ కేసుల నమోదు కు నాలుగు నెలల క్రితమే తీర్పులు తీసుకొస్తే, ప్రస్తుత మీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ అధికారులు దాన్ని బేఖాతర్ చేసి అమలు చేయకుండా వ్యవహరించడం ఈ ప్రభుత్వానికి సిగ్గు - చేటు కాదా అని ఆయన ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేస్తే ఏకంగా ఇక జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా అమలు కాకపోవడంలో ఆంతర్యం ఏమిటో...? ఈ ముగ్గురు సీనియర్ నాయకులే ఆలోచించి మా గ్రామ ప్రజలకు సరైన సమాధానం చెప్పి తగు న్యాయం చేయాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలోనే ఈ భారీ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఇంత తీవ్రమైన పోరాటం నేటికీ కొనసాగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదని చుక్క గంగారెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మీది, పాలన మీది, అధికారం మీది, రాజ్యమంతా మీదే.... అయినా న్యాయస్థానాల తీర్పులు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదంటే.... ఇక మీ పాలన, మీ రాజకీయ పరిపాలనా ఎమౌతున్నట్లూ..., ఎవరి పాలు అవుతున్నట్లూ.... అని ఆయన సందేహాలను వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఇంకా కూడా మీరు స్పందించక పోవడంలో అస్సలు ఆంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్సీ అయిన టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ ల పైననే ప్రజలు, మేము ఆధార పడాల్సి వస్తుందని అన్నారు. వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చుక్క గంగారెడ్డి సూచించారు.
ఇకనైనా మీ ముగ్గురు సీనియర్ నాయకులు స్పందించి వెంటనే లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, సమాచార కమీషన్ తీర్పులను, జిల్లా కలెక్టర్ ఆదేశాల ఉత్తర్వులను అమలు పరచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్ మూల సుమలత, అందుకు సహకరించిన పాలక వర్గం, బాధ్యులైన అధికారులు అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని ఆయన మరొక్క సారి విజ్ఞప్తి చేశారు.
ఈ విలేఖరుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి రాజేందర్, విడిసి కోర్ కమిటీ కోచైర్మన్ పెద్దనవేని రాగన్న, మాజీ ఉప సర్పంచ్ నగునూరి పెద్ద రామ గౌడ్, పెద్దనవేణి మల్లేష్, మాజీ వార్డ్ సభ్యులు గంజి జగన్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
