ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!

On
ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!

నిధుల దుర్వినియోగం పై చర్యలు ఏవి...?

 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - టి.జీవన్ రెడ్డి - బాదినేని రాజేందర్ లే బాధ్యత వహించాలి

లోకాయుక్త తీర్పుకు నాలుగు నెలలు

జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు నెల రోజులా...?

అయినా క్రిమినల్ కేసుల నమోదులో చర్యలు శూన్యం

"ఎంపిఓ" నే ప్రభుత్వాన్ని -  న్యాయస్థానాలను మించిన "సుప్రీం"

మీరెందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించిన "చుక్క గంగారెడ్డి
బుగ్గారం ఏప్రిల్ 05:: 

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన కోటికి పైగా నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ లే పూర్తి బాధ్యత తీసుకొని దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి మొత్తం ప్రజా ధనాన్ని రికవరీ చేయించాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కోరారు.

శనివారం ఆయన బుగ్గారం గ్రామస్తులతో, విడిసి బృందంతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ లోకాయుక్త న్యాయస్థానం నుండి తీర్పు వెలువడి నాలుగు నెలలు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులు గడుస్తున్నా క్రిమినల్ కేసులు నమోదు చేయించడంలో పంచాయతీ అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఇందుకు భారీ అవినీతితో పాటు, రాజకీయ ఒత్తిల్లే కారణమని ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు.


న్యాయస్థానాలను, అధికార పార్టీని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మించిన "సుప్రీం" గా బుగ్గారం మండల పంచాయతీ అధికారి "అఫ్జల్ మియా" వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఒక ఎంపిఓ ఇంతటి దారుణానికి పాల్పడితే ఇక ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీటిసి బాదినేని రాజేందర్ లు మౌనం పాటించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.


 దీనికి కారకులు ఎవరో మీరే అర్థం చేసుకోవాలని చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ నిధుల దుర్వినియోగం పై ప్రాణాలకు తెగించి, ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి,  ఐదున్నర సంవత్సరాలుగా ధర్మంగా, న్యాయంగా, చట్ట బద్దంగా, నీతి - నిజాయితీతో పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల మీద కేసులు వేసి
లోకాయుక్త న్యాయస్థానంలో గెలుపొంది క్రిమినల్ కేసుల నమోదు కు నాలుగు నెలల క్రితమే తీర్పులు తీసుకొస్తే, ప్రస్తుత మీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ అధికారులు దాన్ని బేఖాతర్ చేసి అమలు చేయకుండా వ్యవహరించడం ఈ ప్రభుత్వానికి సిగ్గు - చేటు కాదా అని ఆయన ప్రశ్నించారు.


జిల్లా కలెక్టర్ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేస్తే ఏకంగా ఇక జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా అమలు కాకపోవడంలో ఆంతర్యం ఏమిటో...? ఈ ముగ్గురు సీనియర్ నాయకులే ఆలోచించి మా గ్రామ ప్రజలకు సరైన సమాధానం చెప్పి తగు న్యాయం చేయాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలోనే ఈ భారీ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. ఇంత తీవ్రమైన పోరాటం నేటికీ కొనసాగుతున్నా మీరు ఎందుకు స్పందించడం లేదని చుక్క గంగారెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు.


ఇప్పుడు ప్రభుత్వం మీది, పాలన మీది, అధికారం మీది, రాజ్యమంతా మీదే.... అయినా న్యాయస్థానాల తీర్పులు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదంటే.... ఇక మీ పాలన, మీ రాజకీయ పరిపాలనా ఎమౌతున్నట్లూ..., ఎవరి పాలు అవుతున్నట్లూ.... అని ఆయన సందేహాలను వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఇంకా కూడా మీరు స్పందించక పోవడంలో అస్సలు ఆంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్సీ అయిన టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  బుగ్గారం మాజీ జడ్పీటిసి బాదినేని రాజేందర్ ల పైననే ప్రజలు, మేము ఆధార పడాల్సి వస్తుందని అన్నారు. వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చుక్క గంగారెడ్డి సూచించారు.

IMG-20250405-WA0008 ఇకనైనా మీ ముగ్గురు సీనియర్ నాయకులు స్పందించి వెంటనే లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, సమాచార కమీషన్ తీర్పులను, జిల్లా కలెక్టర్ ఆదేశాల ఉత్తర్వులను అమలు పరచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్ మూల సుమలత, అందుకు సహకరించిన పాలక వర్గం, బాధ్యులైన అధికారులు అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని ఆయన మరొక్క సారి విజ్ఞప్తి చేశారు.
ఈ విలేఖరుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి రాజేందర్, విడిసి కోర్ కమిటీ కోచైర్మన్ పెద్దనవేని రాగన్న, మాజీ ఉప సర్పంచ్ నగునూరి పెద్ద రామ గౌడ్, పెద్దనవేణి మల్లేష్, మాజీ వార్డ్ సభ్యులు గంజి జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...
Local News 

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు సిఐటియూ జెండాను  ఆవిష్కరించిన మండల సిఐటియు  అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు....
Read More...
Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...