నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్
సికింద్రాబాద్ ఏప్రిల్29 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ నియోజకవర్గం హైదరాబాదు రెవెన్యూ పరిధిలోని తిరుమలగిరి తాహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. తిరుమలగిరి పల్లవి స్కూల్ లో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథులు గా ప్రత్యేక (ఎస్ హెచ్ ఓ) రెవెన్యూ కలెక్టర్ అపర్ణ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) వెంకట చారి,హెచ్ఎండిఏ ఓఎస్డి మనోహర్, సికింద్రాబాద్ ఆర్డీవో పి.సాయిరాం,హైదరాబాద్ ఆర్టీవో రామకృష్ణ,మారేడ్ పల్లి తాసిల్దార్ భూమయ్య, సికింద్రాబాద్ తాసిల్దార్ పాండునాయక్, హిమత్ నగర్ తాసిల్దార్, మాజీ తాసిల్దార్ శ్రీనివాసరావు,జ్యోతి లు హజరయ్యారు. తహసిల్దార్ ఎస్ ఉమా అశోక్ కుమార్ దంపతులను శాలువా, గజ పూలమాలుతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్.అశోక్ కుమార్ తన పదవీ కాలంలో నీతి, నిజాయితీ తో పనిచేశారని,ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారని పలువురు అభినందించారు. 31 సంవత్సరాల రెండు నెలల పాటు ఉద్యోగబాధ్యతలు నిర్వహించిన ఎస్ అశోక్ కుమార్ పదవీ విరమణ తరువాత జీవితాన్ని ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా గడపాలని పలువురు ఉన్నతాధికారులు ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపలు మండలాల తహాసిల్దారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
