ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 08 (ప్రజా మంటలు).
ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్న సందర్బంగా జగిత్యాల జిల్లా లో ఎలక్ట్రిసిటీ సమస్యలు తెలపడానికి 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయబడినవి.
విద్యుత్ సంబంధిత సమస్యలకు & ఫిర్యాదులు తెలియజేయడానికి మొబైల్ నంబర్లను సంప్రదించాలి.
- జిల్లా కేంద్రం లోని జగిత్యాల సర్కిల్ కంట్రోల్ రూమ్ --- 7901628366,
- జగిత్యాల డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 9440811398,
- మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని కంట్రోల్ రూమ్ --- 7901678208,
అలాగే టోల్ ఫ్రీ నెంబరు.1800 4250028 కు లేదా 1912 ఫోన్ చేయగలరని మనవి.
రైతులు, విద్యుత్ వినియోగదారులకు ఈ క్రింది విద్యుత్ ప్రమాదాల నివారణ సూచనలు అనుసరించాలని జి. సత్యనారాయణ - ఎస్.ఈ, టి ఎస్ఎన్ పిడిసి ఎల్, జగిత్యాల విజ్ఞప్తి చేశారు:
- మీ దగ్గరలో కాని, మీ ఇంట్లోగాని తడి చేతులతో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకోకండి. ముఖ్యంగా బట్టలు ఆరేసే దండెంలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోండి,
- విద్యుత్ ప్రవహిస్తున్న సర్వీస్ వైర్లకు ఎలాంటి అతుకులు లేకుండా చూసుకోండి, ఒక వేళ అలాంటి అతుకుల ఉన్న వైర్లను వెంటనే అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ తో సరి చేయించండి/ మార్పించండి.
- ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకండి.
- వర్షాలు కురుస్తున్నప్పుడు, రైతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్లకండి, మీ యొక్క స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోగలరు.
- వోల్టేజ్లో హెచ్చు తగ్గలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
- వర్షాల వల్ల చెట్లు లేక చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
- తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, మరియు వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు.
- ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు.షాక్ గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లేదా ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
- ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంటు మోటార్లను కాని,ఇనుప పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమర పాటుతో తాకకూడదు.
- వ్యవసాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్ లు తాకడం అత్యంత ప్రమాదకరం.
- డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
- మోటారు మరియు పంపుసెట్లకు, ఇంటి లోని విద్యుత్ పరికరాలు, ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు.
- రైతులు/వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు మరియు సర్విస్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వాటిని తాకకుండా దూరంగా నడవాలి.
పై సూచనలతో అందరూ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బందికి, జూనియర్ లైన్మెన్, లైన్ మెన్ , లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్ మెన్, సబ్ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను వినియోగించుకోవాలి అని ఎస్ ఈ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న
తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు.
వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల... బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ
ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
✔ప్రభుత్వం హామీ (42%)
✘ అమలైన... చైనా–అరుణాచల్ పాస్పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన
న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి):
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది.
లండన్ నుంచి జపాన్కు ట్రాన్సిట్ ప్రయాణం... నల్లగొండ కాంగ్రెస్లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి... “ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):
జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని... ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) : తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు.
RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM... చాచా నెహ్రూ నగర్లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు):
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా... గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్తు లైన్లు మరమత్తు కొరకు శంకుస్థాపన
(అంకం భూమయ్య(
గొల్లపల్లి నవంబర్ 25 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీరాములపల్లె లో విద్యుత్ వైర్లు, విద్యుత్ పనులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలోశ్రీరాములపల్లె,... భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్ లో భక్తుల రద్దీ
ఆకట్టుకున్న యోధ కళాకారుల కత్తి ప్రదర్శనలు...
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :
సిక్కుల తొమ్మిదవ మత గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్జీ 350వ శహీద్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన నగర్ కీర్తన్ ఘనంగా జరిగింది. శబద్ కీర్తనాలు, సాహాస కృత్యాలైన సిక్కు కళ గట్కా యోధ కళ ప్రదర్శనలు... పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ – మూడు విడతల్లో పోలింగ్
ఈ క్షణం నుంచే ఎలెక్షన్ కోడ్ అమల్లోకి
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
🗳️పోలింగ్ షెడ్యూల్
1️⃣ తొలి విడత – డిసెంబర్ 11
2️⃣ రెండో విడత –... కాంగ్రెస్లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు
డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…“వర్గాల వేటగాళ్ల లీగ్”లేదా“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ”
ఎందుకంటే బయటకు కాంగ్రెస్... 