ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు.

- జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు

On
ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు.

 

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల మార్చి 25( ప్రజా మంటలు) : 

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ పాల్గొని జిల్లా ప్రజలకు అధికారులకు సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని నింపి, రంగులమయం చేయాలని ఎస్పీ ఆకాంక్షించారు.

హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని వేడుకల్లో పాల్గొనేవారు మద్యం సేవించకుండా దానికి దూరంగా ఉండాలని,హోలీ వేడుకల తర్వాత స్నానాలకు చెరువులు కాలువల దగ్గర జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.

ఈ యొక్క వేడుకల్లో అడిషనల్ ఎస్పీలు వినోద్ కుమార్, భీమ్ రావు , ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ డీఎస్పీలు రఘు చందర్, ఉమామహేశ్వరరావు, రవీంద్ర కుమార్, ఎస్ బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సి.ఐ లు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags