నటుడు,రాజకీయ నాయకుడు విజయ్ పై ₹1.5 కోట్ల పెనాల్టీ వివాదం
– ఐటీ శాఖ వాదన, అక్టోబర్ 10కి విచారణ వాయిదా
చెన్నై, సెప్టెంబర్ 30:
తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు, సినీ నటుడు సి. జోసెఫ్ విజయ్‌పై ఆదాయపు పన్ను శాఖ విధించిన ₹1.5 కోట్ల పెనాల్టీపై మద్రాస్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
2015లో పులి సినిమా సమయంలో విజయ్ అదనంగా సంపాదించిన ₹15 కోట్ల ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించలేదని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. దర్యాప్తులో ఆయన ₹5 కోట్లు నగదు రూపంలో స్వీకరించినట్లు అంగీకరించారని, ఆ తర్వాతే మొత్తం ఆదాయాన్ని డిక్లేర్ చేశారని శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో, ఐటీ శాఖ ఆదాయపు పన్ను చట్టంలోని 271AAB(1) సెక్షన్ కింద ₹1.5 కోట్ల జరిమానా విధించింది. అయితే, ఈ పెనాల్టీ చెల్లదని విజయ్ 2022లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
మంగళవారం జరిగిన విచారణలో శాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్ — “పెనాల్టీ చట్టబద్ధమే, పిటిషన్ కొట్టివేయాలి” అని వాదించగా, విజయ్ తరఫు న్యాయవాది — “పెనాల్టీ నోటీసు లిమిటేషన్ పీరియడ్‌కి మించి, 2022లో జారీ చేశారు. ఇది చెల్లదు” అని వాదించారు.
ఈ వాదనలపై జస్టిస్ సి. సరవణన్ స్పందిస్తూ, ఇలాంటి మరో కేసులో తన తీర్పును సమర్పించాలని సూచించి, విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
