ఆరు గంటల పాటు భీష్మించుకు కూర్చుని...
ప్రజా సమస్యలను పరిష్కరించిన డా.కోట నీలిమ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 20 (ప్రజామంటలు ):
భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన కాలనీల్లో పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పర్యటించారు. ఈ సందర్భంగా శుక్రవారం బేగంపేట్ డివిజన్ లోని బ్రహ్మణ్వాడి ఏరియాలో వరద ప్రభావిత ఇళ్లను సందర్శించారు. ఈ క్రమంలో వీధిలో డ్రైనేజి లీక్ అవుతున్న సమస్యను స్థానికులు కోట నీలిమ దృష్టికి తీసుకెళ్లారు. పక్కనే నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ యజమాని డ్రైనేజీని బ్లాక్ చేయడంతో పాటు రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించారని స్థానికులు తెలపగా వెంటనే నీలిమ స్పందించారు.
పై అధికారులకు సమస్య గురించి వివరించి 24 గంటల్లో వాటికి పరిష్కారం చూపాలని కోరారు. కాగా సమస్యపై అధికారుల్లో చలనం లేదని,ఇంకా పరిష్కరించలేదని, స్థానికులు మళ్ళీ కోట నీలిమ దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఆమె బ్రాహ్మణవాడకు వచ్చి అధికారులను ఫీల్డులోకి పిలిపించారు.
డ్రైనేజి బ్లాకేజీ, ప్రభుత్వ స్థలం ఆక్రమించి సాగిస్తున్న కట్టడాలపై అధికారులను నిలదీశారు.
ఈ రెండు సమస్యలు పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో స్థానికులతో కలిసి సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కాగా కోట నీలిమ ఒత్తిడికి తలొగ్గిన అధికారులు డ్రైనేజీ బ్లాకేజిని తొలగించి మురుగు నీరును తొలగించారు. అనంతరం రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడను సైతం జేసీబీతో కూల్చివేశారు. చాలా రోజులుగా డ్రైనేజి లీకేజి వల్ల దుర్గంధం వెదజల్లడంతో పాటు రోడ్డు అక్రమణతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని.. కోట నీలిమ చొరవతో రెండు దీర్ఘకాలిక సమస్యలకు వెంటనే పరిష్కారం లభించిందని అన్నారు.
ఈ క్రమంలో వారు కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్, NBT నగర్, బ్రాహ్మణవాడ ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
