గాంధీ మెడికల్ కాలేజీలో వరదనీటి కష్టాలు
సెల్లార్ లో నిలిచిపోయిన డ్రైనేజీ, వర్షపు నీరు
రంగంలోకి హైడ్రా సిబ్బంది
ఆందోళనలో వైద్య విద్యార్థులు, సిబ్బంది
సికింద్రాబాద్, సెప్టెంబర్ 20 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో డ్రైనేజీతో పాటు వర్షపు నీరు బెడద పెరిగిపోయింది. కాలేజీ భవనంలో కాలం చెల్లిన డ్రైనేజీ కారణంగా కాలేజీ భవనంలోని డ్రైనేజీ నీరు బయటకు పోలేక సెల్లార్ లోనే జామ్ అవుతోంది. కాలేజీ సెల్లార్ లోని డ్రైనేజీ పైపుల ఎత్తు కన్నా పద్మారావునగర్ వైపు కు వెళ్ళే డ్రైనేజీ పైప్ లైన్ లు ఎత్తు ఎక్కువగా ఉండటంతో డ్రైనేజీ నీరు బయటకు సక్రమంగా వెళ్ళడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
కాగా ఇటీవల వరసగా కురిసిన వర్షాలతో మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన కురిసిన వర్షపు నీరంతా సెల్లార్ లోకి వెళ్ళడంతో సెల్లార్ నీట మునిగింది. లిఫ్టుల కింది భాగంలోకి కూడ నీరు వెళ్ళడంతో వెంటనే లిఫ్టులను మూసివేశారు. అలాగే సెల్లార్ లోకి ఎవరు వెళ్ళకుండా దారిని తాత్కలికంగా మూసివేశారు. దాంతో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారింది. సెల్లార్ లో నిలిచిన నీటి ద్వారా దురదృష్టవశాత్తు కరెంట్ సరఫరా జరిగితే పెద్ద ప్రమాదం సంభవిస్తుందని సిబ్బంది, వైద్య విద్యార్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్ లోని నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు హైడ్రా సిబ్బంది కాలేజీకి చేరుకొని పనులు నిర్వహించారు.
ఈ విషయమై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా ను ప్రశ్నించగా, ఇప్పటికే తాము కాలేజీ లోని డ్రనేజీ సమస్య గురించి ప్రభుత్వానికి మూడు సార్లు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరీ చేస్తే, టీజీఎంఎస్ఐడీసీ సంస్థ టెండర్లు పిలిచి కొత్తగా పైప్ లైన్ పనులు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన గాంధీ మెడికల్ కాలేజీ డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి, నిధులు మంజూరీ చేసి, కొత్తగా డ్రైనేజీ పనులను ప్రారంభించాలని వైద్య విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
