బొల్లారం బజార్వద్ద రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి
ఒకరికి తీవ్రగాయాలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 20 (ప్రజామంటలు) :
బొల్లారం బజార్రైల్వే స్టేషన్సమీపంలో శనివారం ఉదయం జరిగిన రైల్వే ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 07:50 గంటల సమయంలో కిలోమీటర్ నెంబర్.608/24-–22 మధ్యలో, బొల్లారం బజార్రైల్వే స్టేషన్ప్లాట్ఫామ్నెంబర్–2 వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే పట్టాలు దాటుతుండగా, ఆ సమయంలో తిరుపతి–అకోలా ఎక్స్ప్రెస్(రైల్ నెంబర్ 07605) వస్తోంది. లోకో పైలట్హారన్కొట్టినప్పటికీ వారు పట్టాలపై ఉండటంతో రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్సిబ్బంది సహాయంతో గాయపడిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారు మచ్చ బొల్లారం నివాసి కూలీ కొండగళ్ల కార్తిక్(19,), మల్కాజ్గిరి నివాసి కూలీ టంగుటూరు మల్లికార్జున్(20)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి శివానంద్(35) మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన మత్య్సకారుడు అని పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ జీఆర్ఎపీ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నంబర్/25 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ప్రాథమికంగా మద్యం సేవించి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టిన ప్రమాదమని భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
