విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ
జగిత్యాల సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలమేరకు సైబర్ నేరాలు నివారణ , సైబర్ భద్రత అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున *సైబర్ జాగౄక్త దివాస్* అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత , సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అందులో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక SKNR డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ...నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని విద్యార్థులకు వివరించారు. యువత ఎక్కువగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, బ్యాంకింగ్ యాప్‌లు, డిజిటల్ లావాదేవీలను వినియోగిస్తున్నందున వారిని టార్గెట్ చేస్తూ నేరస్తులు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు.ఈ యెక్క కార్యక్రమ0 లో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది అన్నారు.
విద్యార్థులకు ముఖ్యంగా ఈ అంశాలపై అవగాహన కల్పించారు
*RTA eChallan Fraud:*కొంతమంది నకిలీ SMS లేదా WhatsApp మెసేజ్‌లు పంపిస్తూ, మీ వాహనంపై పెండింగ్ ఛలాన్ ఉందని చెప్పడం జరుగుతుంది అటువంటి లింకులు క్లిక్ చేస్తే మీ బ్యాంక్ వివరాలు మోసగాళ్లకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది కావున పెండింగ్ ఛలాన్ వివరాలు ఎల్లప్పుడూ అధికారిక RTA వెబ్‌సైట్ లేదా పార్కింగ్/ట్రాఫిక్ విభాగం అధికారిక యాప్ ద్వారానే చెక్ చేయాలి.
*Fake Profile Scam:*సోషల్ మీడియా లేదా మ్యాట్రిమోని సైట్లలో నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించి స్నేహం పెంచి డబ్బు కోరే ఘటనలు పెరుగుతున్నాయి కావున పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
*Fake Customer Services (Online bookings):*కొన్ని నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు లేదా బుకింగ్ లింకులు ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నారు.ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్/యాప్ ద్వారానే బుకింగ్‌లు చేయాలి. గూగుల్‌లో కనిపించే కస్టమర్ కేర్ నంబర్లను నమ్మకూడదు.
అలాగే సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణం సమాచారం ఇవ్వడం వలన బాధితులు తమ డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, డీఎస్పీ సూచనలను గమనించి ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్ ,టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ , సైబర్ క్రైమ్ ఎస్.ఐ లు కృష్ణ ,దినేష్ మరయు సైబర్ క్రైమ్ సిబ్బంది ,కళాశాల అధ్యాపకులు, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
