లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల/ ధర్మపురి/ రాయికల్ జగిత్యాల ఆగస్ట్ 28 (ప్రజా మంటలు)
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి..
ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి..
ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చర్యలు వేగంగా చేపట్టాలి..
ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందనీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లాలో బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా గురువారం ధర్మపురి గోదావరి నది, ధర్మపురి మండలం నేరెళ్లలో లో జగిత్యాల మండలం అనంతారం బ్రిడ్జి రాయికల్ మండలం రామోజీపేట బ్రిడ్జి ఇటిక్యాలలో లో లెవెల్ బ్రిడ్జి ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్గా ఉంచాలని అధికారులకు సూచించారు. ముందు జాగ్రత్తగా చెప్పడాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి నుండి 39 గేట్లు నుండి.నీటిని గోదావరి నదిలోకి వదిలారనీ పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు నుండి 6 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి నీటిని వదిలారనీ, గోదావరి నది భారీగా నీటి ప్రవాహం వస్తున్నందున గోదావరి నది తీర ప్రాంతాలలో లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్ ఆర్ ఎస్ పి. మరియు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరిలోకి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున గోదావరిలో భారీగా వరద వస్తున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగంతో తో కలిసి గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు.. గత 15 రోజులుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వరద పై రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించడం జరిగిందని,ప్రజలు ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని,ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు,పోలీసులు అందుబాటులో ఉంటారని, అధికారులకు కూడా తీర ప్రాంత ప్రజలు సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
ప్రజలంతా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా అధికారులను తమను సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీవో తహసీల్దారులు, పోలీస్ సిబ్బంది సిఐఎస్ఐ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
