భారీ వర్షాలు, వరదల పట్ల విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి
మెట్పల్లి ఆగస్టు 28 ( ప్రజా మంటలు)
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వచ్చే ఆకస్మిక వరదల నేపధ్యంలో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాటి రక్షణకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని వినియోగారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందజేయడానికి అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిర్మల్, కామారెడ్డి పర్యటనలో బాగంగా మార్గమధ్యంలో మెటుపల్లి డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్షాల అత్యవసర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతీ ఉద్యోగి ఇలాంటి విపత్తు సమయంలో రేయింబవళ్ళు కష్టపడి పనిచేయాలని, ప్రమాదాలు ముందే ఊహించి తక్షణం స్పందించాలని, అన్ని రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా హితవు పలికారు. ప్రతీ సెక్షన్ లో కాంట్రాక్టర్లను యంత్రాలు, కార్మికులతో సిద్ధంగా ఉంచాలని స్తంభాలు, సామగ్రి నిలువ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ మనోహర్, ఏఈలు అమరేందర్, రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్ మరియు జేఏఓలు రాజశేఖర్, కరీం, రాజేష్, తిరుపతిరావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెరుగైన ప్రమాణాలతో విద్య బోధన, క్రీడలలో ఆసక్తి పెంచాలి - సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.

మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్

30 పడకల ఆసుపత్రిలో 3 ఏళ్లుగా పనిచేయని ఎక్స్ రే మిషన్

యూరియా కై రైతుల పాట్లు దయనీయం... చిన్న మార్పులతో పెద్ద పరిష్కారం..

గాంధీ టీఎన్జీవో వినాయకుడి సన్నిధిలో పూజలు

ఎర్దండి గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్

గోదావరి తీరం ప్రాంతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి,

కొలువుదీరిన గణనాథులు ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలోని బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన జిల్లా కలెక్టర్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
